బాలీవుడ్ బడా నిర్మాత బోనీకపూర్-దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్(janhvi kapoor) అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. `ధ‌డ‌క్‌` అనే హిందీ మూవీతో 2018లో సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్.. తొలి సినిమాతోనే తన నటనా ప్రతిభ‌ను చూపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ధడక్‌ అనంతరం బాలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. అయితే ఈ బ్యూటీ కి సరైన హిట్ మాత్రం పడడం లేదు. నాలుగేళ్ల నుంచి ఎంత కష్టపడుతున్న స‌రే సక్సెస్ అనేది ఈమె వైపు తొంగి కూడా చూడడం లేదు.

రీసెంట్ గా `మిలీ(mili)` అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఓటీటీ వేదికగా విడుద‌లైన ఈ చిత్రం సైతం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం జాన్వీ చూపులన్నీ సౌత్ పైనే ఉన్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాలనే కోరికతో ఈ బ్యూటీ తీవ్రంగా రగిలిపోతుంది. ఈ క్రమంలోనే అవకాశం దొరికినప్పుడల్లా తెలుగు సినిమాల‌ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తోంది.

తాజాగా ఈ అమ్మడు ఒక ఫ్యాషన్ షోలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన జాన్వీ కపూర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అంతేకాదు నార్త్ లో పెరిగినా తాను సౌత్ అమ్మాయినే అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాల‌నే తాను పాటిస్తానని, సౌత్(south) తో తనకు ఎమోషనల్ కనెక్షన్ ఉందని జాన్వీ చెప్పుకొచ్చింది. అలాగే తెలుగు సినిమా చేయడానికి తాను ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, త్వరలోనే ఆ కోరిక తీరుతుందన్న నమ్మకం తనకు ఉందని జాన్వీ చెప్పుకొచ్చింది.

అంతేకాదు తెలుగు సినిమాలు చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉంది, ఒక‌ప్పుడు టెలివిజన్ ఛానల్స్ లో మాత్రమే తెలుగు సినిమాలు డబ్‌ అయి వస్తూ ఉండేవి. కానీ, ఇప్పుడు నేరుగా థియేట‌ర్స్ లో విడుదల అవుతూ మంచి విజ‌యం సాధిస్తున్నాయి` అంటూ జాన్వీ పేర్కొంది. మొత్తానికి జాన్వీ కపూర్ తన మాటలతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసింది. మరి ఈ భామ టాలీవుడ్(tollywood) ఎంట్రీకి ముహూర్తం ఎప్పటికి కుదురుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *