టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్(kajal aggarwal)కు ఉన్న క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. 2004లో ఓ హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన కాజల్.. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత `చందమామ` సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ మరియు కోలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుని అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది.

టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రి సరసన ఆడి పాడిన ఈ బ్యూటీ.. 2020లో త‌న‌ చిన్ననాటి స్నేహితుడు, ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ(Gautam Kitchlu)తో ఏడడుగులు నడిచి వైవాహిక బంధం లోకి అడుగు పెట్టింది. పెళ్లి తర్వాత కూడా అడపా తడపా సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్.. గ‌త ఏడాది ప్రెగ్నెంట్ కావడంతో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో కాజల్ కు పండంటి మగ బిడ్డ జన్మించాడు. ఇక కుమారుడు పుట్టడంతో కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందంటూ ప్రచారం జరిగింది.

కానీ ఆ ప్రచారం చివరకు పుకారే అయింది. కాజల్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. తమిళంలో కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రూపదిద్దుకుంటున్న `ఇండియ‌న్ 2(indian 2)` సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. కాజల్ పెళ్లి కావడానికి ముందే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. కానీ అనుకోని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయింది. కాజల్ సైతం షూటింగ్ లో పాల్గొంటుంది. అలాగే కాజల్ చేతిలో మరికొన్ని ప్రాజెక్ట్ సైతం ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. కాజల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

అదేంటంటే టాలీవుడ్ కు చెందిన ఓ సీనియర్ స్టార్ హీరో మూవీలో కాజల్ ను హీరోయిన్గా నటించమని అడిగారట. కానీ కాజల్ మాత్రం ఆ హీరోతోనా? నేను నటించను అంటూ రిజెక్ట్ చేసిందట. గతంలోనూ అదే హీరో సినిమాకు కాజల్ ను అడ‌గ‌గా.. అప్పుడు సైతం నో చెప్పిందంట. భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫర్ చేసినా ఆ సీనియర్ స్టార్ తో నటించనని చెప్పి అవమానించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరు అన్న‌ది తెలియకపోయినా యాంటీ ఫ్యాన్స్ మాత్రం కాజల్ పై కావాలని సోషల్ మీడియా ద్వారా విమర్శల వర్షం కురుపిస్తున్నారు. కాజల్ కు ఎంత పొగరు.. స్టార్ హీరో సినిమాను రెండు సార్లు రిజెక్ట్ చేసి అవమానించిందా అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *