సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ సరసన నటించి మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న మహానటి సావిత్రి (Savitri) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. జీవితంలో ఉన్నతంగా బ్రతికిన ఈమె చివరి క్షణంలో ఆర్థికంగా మరింత ఇబ్బందులు పడ్డారు. ప్రముఖ తమిళ నటుడు జెమినీ గణేష్ ను వివాహం చేసుకున్న తర్వాత.. ఈ దంపతులకు సతీష్ , విజయ చాముండేశ్వరి అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. అయితే సావిత్రి వారసులుగా అటు కొడుకు, ఇటు కూతురు సినిమాలపై ఆసక్తి చూపలేదు. కానీ సావిత్రి కుమార్తె చాముండేశ్వరి మాత్రం ఒక సీరియల్లో నటించింది.

మరి చాముండేశ్వరి రెండో తనయుడు అభినయ్ మాత్రం వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి అమ్మమ్మకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. సావిత్రి వారసుడిగా తన నటనతో ప్రముఖుల మన్ననలు అందుకున్న అభినయ్ అసలు సావిత్రి మనవడు అన్న విషయం చాలామందికి తెలియదు.తన అమ్మమ్మకు నట వారసుడిగా మారతానంటూ వెండితెరపై అడుగుపెట్టి దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వంలో “యంగ్ ఇండియా” సినిమాతో తెరంగేట్రం చేశాడు.

చిన్నప్పటి నుంచి టేబుల్ టెన్నిస్ (Table tennis) లో తమిళనాడు స్టేట్ తరపున పాల్గొని మంచి క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చెన్నైలో బీకాం చదివి ఆ తర్వాత యూకే కి ఉన్నత చదువు నిమిత్తం వెళ్లి.. అక్కడ ఎంఎస్ కూడా పూర్తి చేశాడు. అక్కడ చదువుతున్న సమయంలోనే తన అమ్మమ్మ సావిత్రికి ఉన్న పేరు, ఆమె గొప్పతనం తెలిసింది. అంతేకాదు ఆమె వారసులు ఇండస్ట్రీలో ఉండాలని కోరుకున్నారు అన్న విషయం అర్థం చేసుకున్న అభినయ్ తన దృష్టిని సినిమాలపై మరల్చాడు.

అలా అల్లు అర్జున్ , రామ్ చరణ్, మంచు మనోజ్ లతో స్నేహం పెంచుకున్న అభినయ్.. తెలుగు సినిమాలు.. కోలీవుడ్ సినిమాలే కాకుండా హాలీవుడ్ సినిమాలలో కూడా నటించాడు. భారత గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ (Sreenivasa Ramanujan) బయోపిక్ లో అభినయ్ నటించాడు. తన నటనతో విదేశీ ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకొని అమ్మమ్మకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకొని.. కొంతకాలానికే తెరమరుగయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *