స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఆయన నట వారసత్వం జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో ఎంతటి శత్రువులైనా సరే మిత్రులవుతూ ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని వల్లభనేని వంశీ ఒట్టు వేసుకున్నారట. అసలు కారణమేమిటో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

టిడిపి రెబల్ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కి మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. వంశీ ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని బాగుండేవారు.. ఆ సర్కిల్ కావడంతో వాళ్లతో నాకు పరిచయం కూడా ఏర్పడింది అంటూ వంశీ తెలిపాడు.. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ తో నా బాండింగ్ చాలా బాగుండేది.. ప్రస్తుతం రాజకీయాల కారణంగా పరిస్థితులు మారిపోయాయని వంశీ స్పష్టం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కెరీర్ను చూసుకుంటున్నాడు.. అందుకే రాజకీయాల వైపు రావడం లేదు అని కూడా స్పష్టం చేశాడు.

చంద్రబాబు చెప్పిన విషయాలు నిజమే అయితే సీనియర్ ఎన్టీఆర్ వారసులు ఇతర పార్టీలపై ఎందుకు దృష్టి పెట్టారని కూడా వంశీ కామెంట్లు చేశారు. 2009లో తారక్ చిన్నపిల్లాడు.. అప్పటికే అతనికి ఊహించని రేంజ్ లో క్రేజ్ ఉందని తెలిపారు వంశీ. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ను పణంగా పెట్టి మరి ప్రచారం చేశారని తెలిపిన వంశీ .. అదే సమయంలో నాకు సీటు ఇచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడకూడదని చంద్రబాబు నాయుడు ఒట్టు వేయించుకున్నారని కూడా వంశీ కామెంట్లు చేశారు.

వల్లభనేని వంశీ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే వల్లభనేని చంద్రబాబు నాయుడు పై చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *