టాలీవుడ్ ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్ గా పేరుపొంది ఆ తరువాత చాలా విచిత్రంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మోహన్ బాబు.. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా చెప్పనవసరమే లేదు. ఇక మోహన్ బాబుకు ముక్కుసూటిగా మాట్లాడే తత్వము.. కోపం చాలా ఎక్కువ అని మనకు తెలుసు . క్రమశిక్షణకి మారుపేరని చెప్పవచ్చు. ఈయన ఇండస్ట్రీకి విచిత్రంగా ఎంట్రీ ఎలా ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం.

మోహన్ బాబు ముందుగా దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే అనుకోకుండా మోహన్ బాబుకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అప్పట్లో దాసరి కొత్త వారితో సినిమాలు తీయటానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు.అలా 1975లో స్వర్గం నరకం సినిమా చేయాలనుకున్నారు. ఇందులో ఈశ్వర్, మోహన్ బాబులను హీరోలుగా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఇందులో ఒక కొత్త క్యారెక్టర్ పుట్టుకొచ్చింది. అదే బోసు బాబు ఆయనని ప్రొడక్షన్ వారు రికమండేషన్ చేసి హీరోగా చేయాలని అనుకున్నారట. దీంతో దాసరి నారాయణ ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డాడు.

ఫోటో వివరణ అందుబాటులో లేదు.

ఆ ఆలోచనలోనే దాసరి నారాయణకు ఒక ఐడియా వచ్చింది. మోహన్ బాబుకు బోసు బాబుకు ఒక పోటి పెడదాము. అందులో ఎవరు నెగ్గితే వారికి అవకాశం ఇస్తామని చెప్పటంతో మోహన్ బాబు తన నటనతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు. దీంతో ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా నిలిచాడు. ఇందులో ఛాన్స్ మిస్సయిన బోసు బాబు ఒక వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఆ కాలంలోనే ఎస్ వి ఆర్ బస్ సర్వీసులు నడుపుతూ ఒక గొప్ప వ్యాపారవేత్తగా నిలదోక్కుకున్నాడు.

ఈ విధంగా మోహన్ బాబు వల్ల బోసు బాబు సినిమా రంగంలోకి అడుగు పెట్టకుండా వ్యాపారం లోకి అడుగు పెట్టాడు. ఈ విధంగా బాగా సంపాదించిన బోసు బాబు తర్వాత కాలంలో నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు. ఈ విధంగా మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీలో ఒక గొప్ప పొజిషన్కు ఎదిగాడు. అయితే దీన్ని పట్టి చూస్తే ఎవరికి ఏం చేయాలి అనేది దేవుడు నిర్ణయించి ఉంటాడు కాబట్టి అదే జరుగుతుంది.

https://youtu.be/KbYYOkMdS18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *