దేశముదురు(DESHAMUDURU) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది నటి హన్సిక. ఈమె చిన్న వయసులోనే దేశముదురు సినిమాలో నటించి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ఆమె నటనకు గాను మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అది హిట్టు కాకపోవడంతో ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఇక అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఈ విషయం పక్కన పెడితే..కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్న టైంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో ప్రేమలో పడిందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు తగ్గట్టుగానే వీళ్ళిద్దరూ చెట్టాపట్టాలేసుకొని పబ్బులు, పార్టీలలో తెగ ఎంజాయ్ చేస్తూ చాలాసార్లు మీడియాకు దొరికారు. అంతే కాదు పబ్లిక్ గానే రెచ్చిపోయి రొమాన్స్ చేస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే అంత గాఢంగా ప్రేమించుకున్న వీళ్లిద్దరూ ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికి ఎవరికి తెలియదు. ఇక శింబు హన్సిక ను వదిలేసి ప్రస్తుతం నిధి అగర్వాల్(NIDHI AGARWAL) తో డేటింగ్ చేస్తున్నాడు అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో ఎంత నిజమో తెలియదు కానీ వార్తలు మాత్రం వస్తున్నాయి. అయితే ఈ విషయం పక్కన పెడితే హన్సిక తన స్నేహితుడు సోహెల్ ని పెళ్లి చేసుకుంటున్నట్టు అధికారికంగానే చెప్పుకొచ్చింది. ఇక సోహెల్ ఎవరో కాదు తన ఫ్రెండ్ భర్త. తన ఫ్రెండ్ కి విడాకులు ఇచ్చి హన్సికతో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇక వీళ్ళిద్దరి పెళ్లి డిసెంబర్ 4న జైపూర్ లో చాలా గ్రాండ్ గా జరగనున్నట్లు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని హన్సిక తన మాజీ ప్రియుడు శింబు(SHIMBU) ని సీక్రెట్ గా మీట్ అయినట్లు ప్రస్తుతం కోలీవుడ్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే వీళ్ళిద్దరూ ఎందుకు కలిసారో తెలియదు కానీ ఒక పబ్ లో కలిసి ఒకే దగ్గర గంటకు పైగా మాట్లాడుకున్నారు అంటూ కోలీవుడ్ మీడియా కోడై కోస్తోంది. అయితే ఈ విషయంలో పెళ్లికి వారం రోజులు పెట్టుకొని హన్సిక తన మాజీ ప్రియుడిని ఎందుకు సీక్రెట్ గా కలిసింది అంటూ అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే హన్సిక(HANSIKA) క్లారిటీ ఇవ్వాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *