తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచు మోహన్ బాబు(Manchu mohan babu) ఫ్యామిలీకి ఎంతటి గౌరవం ఉందో మనందరికీ తెలుసు. ఎంతో కష్టపడి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా ..ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈయన ఎంత స్టార్ హీరోగా ఎదిగినప్పటికీ ఈయన కొడుకులు మాత్రం ఇండస్ట్రీలో స్టార్డం తెచ్చుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే మంచు మోహన్ బాబు తెలియకుండానే కొన్ని కొన్ని వివాదాల్లో ఇరుక్కుంటారు.

అలాగే మరికొన్ని ఆయన వివాదాస్పద వ్యాఖ్యల వాళ్ళ చిక్కుల్లో పడుతూ ఇబ్బందులకు గురైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక విషయంలోకి వెళ్తే..ప్రముఖ రైటర్ జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు నటుడు మోహన్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ రోజు విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ తన శతకం ప్రింటింగ్ ఒకటి లేట్ అవ్వడంతో మోహన్ బాబు కొడుకు హీరోగా వచ్చిన దేనికైనా రెడీ (Denikaina ready)సినిమాను వీక్షించారట. ఇక ఈ సినిమా బాగానే ఉన్నప్పటికీ అక్కడక్కడ బ్రాహ్మణులను అవమానిస్తూ మాట్లాడడం ఆయనకు ఏమీ నచ్చలేదట. అంతేకాదు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్న బ్రహ్మానందం, సురేఖల మధ్య వచ్చిన సంభాషణ అప్పుడప్పుడు ఈయనకు చాలా విసుగు తెచ్చిందట.

ఎందుకంటే సురేఖ చాలామంది(surekha) అబ్బాయిలతో మీరు మా ఆయనలా ఉన్నారు అని అనడం ఈయనకు ఏమాత్రం నచ్చలేదట. ఎందుకంటే భారతదేశ స్త్రీ ఎప్పుడూ కూడా వేరే మగవారిని చూసి మా ఆయనలా ఉన్నారని అనదు. అలాగే ఈ సినిమాలో మరొక సన్నివేశంలో ఏముంది కొంతమంది బ్రాహ్మణులు డబ్బులు ఎక్కువ పడేస్తే తోకాడిస్తూ మన వెనకే వస్తారు అంటూ చెప్పే డైలాగ్ ఈయనకు చాలా చిరాకు తెప్పించిందట. వేద పండితులను అలా డబ్బులు ఎక్కువ ఇస్తే తోకాడిస్తూ వస్తారు అనడం నాకు చాలా కోపం తెప్పించింది.ఇక ఈ సినిమాపై నేను అభ్యంతరం వ్యక్తం చేస్తే వాళ్లు నాపై పరువు నష్టం దావా వేశారు.

ఇక ఈ విషయం తెలిసిన బ్రాహ్మణులు, వేద పండితులు మోహన్ బాబు పై శాపనార్థాలు, పిండాలు పెట్టారు. అంతేకాదు ఓ మహిళ తన చెప్పులు కూడా విసిరింది అంటూ ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామా లింగేశ్వరరావు(Jonnavitthula Ramalingeshwar rao) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. ఇక ఈ విషయంలో మంచు విష్ణు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇస్తానని పలుమార్లు హెచ్చరించినా కూడా ఆ ఫ్యామిలీ మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *