ఛార్మీ కౌర్(charmy kaur).. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హైదరాబాద్ కు చెందిన పంజాబీ కుటుంబంలో జ‌న్మించిన ఛార్మీ.. 14 ఏళ్ల వయసులోనే `నీతోడు కావాలి` చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసింది. తెలుగులో `శ్రీ ఆంజనేయం` తో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఛార్మీ.. ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలందరి సరసన ఆడి పాడింది.

తెలుగుతోపాటు తమిళ కన్నడ మలయాళ భాషల్లో 40 కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ క్ర‌మంలోనే ఎన్నో రివార్డులు, అవార్డులు గెలుచుకుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సైతం సంపాదించుకుంది. ఇక `జ్యోతిలక్ష్మి(jyothilakshmi)` సినిమాతో నిర్మాతగా మారిన ఛార్మీ.. క్రమంగా న‌ట‌న‌కు దూరమైంది. ఈమె చివరిగా `సేవకుడు` సినిమాలో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

నిర్మాత గానే సినిమాలు చేస్తూ సక్సెస్ అయింది. నిర్మాతగా కొనసాగుతున్న సమయంలోనూ ఛార్మీకి నటిగా అవకాశాలు వచ్చాయి. కానీ తనకు నటనపై ఇంట్రెస్ట్ లేదని.. ఇకపై అటు వెళ్లే అవకాశాలు కూడా లేవని ఛార్మీ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈమె ఇటీవల `లైగర్` సినిమాను నిర్మించిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(vijay devarakonda), డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్ర‌మిది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ దెబ్బకు బ‌య్య‌ర్లు మాత్ర‌మే కాదు ఛార్మీ మరియు పూరి జగన్నాథ్9puri jagannadh) సైద్ భారీ నష్టాల్లో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో ఛార్మీ ఓ కీల‌క‌ నిర్ణయం తీసుకుందట. డబ్బు కోసం మళ్లీ నటనవైపు మొగ్గు చూపాలని ఆమె డిసైడ్ అయిందట. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మరియు సహాయక పాత్రలు పోషించాలని ఛార్మీ భావిస్తుందంటూ నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి నిజంగానే ఛార్మీ డబ్బు కోసం పాత పనినే ఎంచుకుని మళ్ళీ సినిమాల్లో కనిపిస్తే ఆమె అభిమానులు పండ చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *