తెలుగు సినీ ఇండస్ట్రీలో పాపులర్ అయిన నటులలో నటుడు రఘువరన్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో తండ్రి , విలన్ పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. రఘువరన్ కెరియర్లో 150కు పైగా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదియడమే కాకుండా తను నటించిన చిత్రాలు ఎక్కువగా సక్సెస్ మెజారిటీని అందుకున్నారు. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా రఘువరన్ పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అయితే రఘువరన్ (Raghuvaran) గుండెపోటుతో మరణించడం జరిగిందట. కేవలం మద్యం మాదకద్రవ్యాలకు బానిస కావడం వల్లే రఘువరన్ మృతి చెందారని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఈ నటుడు పై సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు వాటి గురించి తెలుసుకుందాం.

టాలీవుడ్ లో శివ, బాషా ,పసివాడు ప్రాణం వంటి సినిమాలలో నటించి బాగానే పేరు సంపాదించిన రఘువరన్.. చివరిగా ఆటాడిస్తా సినిమాలో నటించారు. ఇమంది రామారావు మాట్లాడుతూ .. రఘువరన్ బాలచందర్ గారి డిస్కవరీ అని ఆయన కామెంట్ చేయడం జరిగింది. రఘువరన్ సినిమాలలో టాప్ పొజిషన్లో ఉన్నప్పటికీ లైఫ్ లో మాత్రం ఫెయిల్యూర్ గా మిగిలిపోయారని తెలియజేశారు. మణిధన్ అనే సీరియల్ లో రఘువరన్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టిందని తెలియజేశారు ఇమంది రామారావు.

విలన్ అనేవారు అప్పట్లో ఎక్కువగా ముఖంపై ఘాటులు, చూడడానికి భయంకరంగా ఉండే క్యారెక్టర్లలో చూపించే వారని తెలియజేశారు. కానీ రఘువరన్ వచ్చిన తర్వాత ఒక్కసారిగా విలన్ షేడ్ అవుట్ మారిపోయిందని తెలియజేశారు. విలన్ కూడా ఇంత స్టైలిష్ గా ఉండవచ్చని రఘువరన్ ప్రూఫ్ చేశారని రామారావు తెలియజేశారు. రఘువరన్ ఎప్పుడూ కూడా ఒకే హోటల్లో ఉండేవారని తెలియజేశారు.

రఘువరన్ ఒకానొక సందర్భంలో తాను ఆరు నెలలలో నేను చనిపోతారని చెప్పారని రామారావు తెలిపారు రఘువరన్ . డైరెక్టర్ ఏం చెబితే అలాంటి వి చేయడంతో పాటు బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వడానికి కూడా చాలా ప్రయత్నించే వారని తెలియజేశారు. ఇక తన గురువు బాలచందర్ అంటే ఆయనకు ఎంతో అభిమానం అని రామారావు తెలియజేశారు. ఇక తన భార్య నుదుట కుంకుమ తీయకూడదని రఘువరన్ చెప్పారని తెలియజేశారు రామారావు. ప్రస్తుతం రామారావు తెలియజేసిన ఈ విషయాలు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *