నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేసిన `వీర సింహారెడ్డి` చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అనంతరం బాలయ్య తన 108వ చిత్రాన్ని సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో పట్టాలెక్కించనున్నాడు.

ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అఫీషియ‌ల్‌ అనౌన్స్మెంట్ వచ్చింది. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహో గార‌పాటి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఇక సినిమాలతో పాటు బాలయ్య ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ షో మొదటి సీజన్ ను బాలయ్య తనదైన హోస్టింగ్ తో ఏ స్థాయిలో సక్సెస్ చేశారో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా అన్ స్టాపబుల్ రికార్డు సృష్టించింది.

ఈ నేపథ్యంలోనే ఇటీవల సీజన్ 2 ను ప్రారంభించారు. అయితే ఈ షో తాజా ఎపిసోడ్ కి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురేష్ రెడ్డి లతో పాటు ప్రముఖ నటి రాధిక గెస్ట్ లుగా హాజరయ్యారు. బాలయ్యకు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి మంచి స్నేహితులు. ఆ స‌న్నిహిత్యంతోనే వారు తాజా ఎపిసోడ్ లో అతిధిలుగావిచ్చేశారు. ఈ ఎపిసోడ్ మంచి రంజుగా సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి మరియు రాధిక ల నుంచి బాలయ్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను రాబట్టారు. ఈ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలు `ఆశ‌` గుర్తుందా? అంటూ ప్రశ్నించారు.

అందుకు బాల‌య్య `ఎందుకు గుర్తు లేదు. అసోసియేషన్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటలే కదా..?` అని ఎదురు ప్రశ్నించాడు. దాంతో బాలకృష్ణ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారు.. మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది అంటూ కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలు ప్రస్తావిస్తుండగా.. బాలయ్య వారిద్దరిని మాట్లాడకుండా ఆపేశారు. దీంతో అసలు ఆశ ఎవరు? బాలయ్య ఎందుకు ఆమె గురించి మాట్లాడడానికి భయపడ్డారు..? అన్న చర్చలు నెట్టింట‌ మొదలయ్యాయి. అయితే బాలయ్యకు ఆశ క్లాస్మేట్ అని తెలుస్తోంది. నెటిజ‌న్లు మాత్రం బాలయ్య ఆశ మధ్య ఏదో ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగే ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరికొందరైతే ఆశ బాలయ్య క్రష్‌ అయ్యి ఉండవచ్చని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంతకీ ఆశ ఎవరో తెలియాలంటే బాలయ్య నోరు విప్పాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *