టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ ఉన్నాడు. ఇక ఈయన నాలుగు పదుల వయసు దాటుతున్న కూడా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. దీంతో చాలామంది అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ ప్రతిసారి అడుగుతూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం తన పెళ్లి గురించి ఇప్పటివరకు ఏ చిన్న క్లారిటీ కూడా ఇవ్వకుండా పెళ్లి మ్యాటర్ ని దాటవేస్తూ వస్తున్నాడు. అయితే ఈ విషయంలో చాలా రోజులుగా ప్రభాస్ అనుష్క ఇద్దరు ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

కానీ వీళ్లు మాత్రం మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ చెబుతున్నారు. అలాగే ప్రభాస్ హీరోయిన్ కృతిసనన్ తో కొన్ని రోజులు డేటింగ్ చేశాడు అంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అలాగే ఆ వార్తలకు మరింత బలం చేకూర్చేలా వీరిద్దరి కెమిస్ట్రీ బయటికి కనిపించడంతో అందరూ నిజమే అని భావించారు. అలాగే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ లాంచ్ చేసే టైంలో అయన మోకాలికి సర్జరీ అయ్యి నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కృతి సనన్ ప్రభాస్ ని పట్టుకొని అందరిలో మరింత అనుమానాలు పెంచింది. అలాగే ఆ టైంలో ప్రభాస్ కి చెమటలు పడితే తన చీర కొంగు ఇచ్చి తుడుచుకోమంది. అయితే ఆ వీడియోలన్నీ అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అయ్యాయి.

ఇక తాజాగా తోడేలు సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది హీరోయిన్ కృతి సనన్. ఇక ఈమె ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో ఎక్కువగా ప్రభాస్ పేరు చెప్పడంతో అందరిలో మరిన్ని అనుమానాలు రేకెత్తాయి. అలాగే ఆ మధ్యన పాల్గొన్న కాఫీ విత్ కరణ్ షోలో కూడా ప్రభాస్ కి ఫోన్ చేస్తే మొదటి రింగుకే ఫోన్ లిఫ్ట్ చేయడంతో వీరి మధ్య ఎన్నో కథలు అల్లేసారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ కి కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే యాంకర్ కృతి సనన్ న్ని ఓ ప్రశ్న అడిగింది అదేంటంటే..

మీరు ఓ ముగ్గురు హీరోలలో ఎవరిని పెళ్లి చేసుకుంటారు.. ఎవరితో డేటింగ్ చేస్తారు.. ఎవరిని ఫ్లర్టింగ్ చేస్తారు అని అడగ్గా.. నేను టైగర్ ష్రాఫ్ తో డేటింగ్ చేస్తా.. కార్తిక ఆర్యన్ ని ఫ్లర్టీంగ్ చేస్తా.. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అంటూ కృతి సనన్ చాలా ఓపెన్ గా చెప్పేసింది. ఇక ఈ విషయం బయటికి తెలియగానే చాలామంది ప్రభాస్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.ప్రభాస్ త్వరలోనే నార్త్ హీరోయిన్ తో పెళ్లి పీటలెక్కబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వస్తున్నాయి. ఇక వీటన్నింటినీ చూస్తూ ఉంటే నిజంగానే ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో ఉంది అని అందరూ భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *