సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఒకటికంటే ఎక్కువ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి జాబితాలో విశ్వనటుడు కమలహాసన్ కూడా ఉన్నారు. కమలహాసన్ ఒకప్పటి హీరోయిన్ సారికను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు లవ్ లో మునిగి తేలిన ఈ జంట 1988లో వివాహం చేసుకోవడం జరిగింది. పెళ్లికి ముందే శృతిహాసన్ కు జన్మనిచ్చిన ఈ జంట ఆ తర్వాత అక్షర హాసన్ అనే అమ్మాయికి జన్మనిచ్చింది. ప్రస్తుతం శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోగా ..అక్షర హాసన్ ఇంకా సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకునే ప్రయత్నం చేస్తుంది.

Kamal Haasan and Sarika were happier separated: Shruti Haasan | Tamil Movie  News - Times of India

ఇదిలా ఉండగా కమలహాసన్ సారికకు విడాకులు ఇచ్చి సింగిల్ లైఫ్ ను గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సారికా కు కమలహాసన్ ఎందుకు విడాకులు ఇచ్చాడు అనే విషయం వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.. పెళ్లి తర్వాత సారిక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సినిమాలలో నటించడానికి గుడ్ బై చెప్పినా సారిక సినిమాలను మాత్రం వదిలి వెళ్లలేదు. కమల్ హాసన్ సినిమాలకు డిజైనర్గా పనిచేసేవారు. 15 ఏళ్ల వరకు వీరి జంట చాలా హ్యాపీగా గడిపింది. కమలహాసన్ సారిక సినిమా ఫంక్షన్లో, ఫ్యామిలీ ఫంక్షన్స్ లో సందడి చేసేవారు.

అయితే ఉన్నట్టుండి ఇద్దరి మధ్య గొడవలు రావడంతో 2004లో విడాకులు తీసుకున్నారు. అయితే తమ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతోనే అని శృతిహాసన్ ఒక ఇంటర్వ్యూలో కూడా వెల్లడించింది. మరీ ముఖ్యంగా శృతిహాసన్ సారిక నుంచి విడాకులు తీసుకున్నప్పటికీ కూతుర్లు అక్షరహాసన్, శృతిహాసన్ల బాధ్యత తీసుకున్నారు. ఇద్దరికీ ఇండస్ట్రీలో సపోర్టుగా ఉంటున్న కమలహాసన్ భార్య సారికతో మాత్రం పెద్దగా సత్సంబంధాలు లేవు.

ఇకపోతే కమలహాసన్ రీసెంట్గా నటించిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని అందుకొని.. మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు విక్రమ్ సీక్వెల్లో కూడా కమలహాసన్ నటించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *