తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోలలో శోభన్ బాబు నటనపరంగా అందం పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన సరసన చాలామంది హీరోయిన్లు నటించారు. శోభన్ బాబు నటించిన కుటుంబ కథ చిత్రాలలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా ఉంటాయి.. తన కెరీర్లో చాలా డీసెంట్గా ఉండడమే కాకుండా ఎలాంటి వివాదాలకు కూడా వెళ్లేవారు కాదు. చెప్పాలంటే మొదటి నుండి శోభన్ బాబు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. శోభన్ బాబు సంపాదించిన ప్రతి రూపాయిని వృధా చేయకుండా భూముల మీద పెట్టుబడి పెట్టే వారిని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.కానీ ఎంత సంపాదించినా ఆయన ఎలా ఉండాలో అలాగే ఉండేవారు. డబ్బు ఉంది అని ఏనాడు గర్వపడేవారు కాదు శోభన్ బాబు.

ఇక సహజ నటిగా ఎన్నో చిత్రాలలో నటించిన జయసుధ తన నటనతోనే సహజ నటిగా పేరుపొందింది. ప్రస్తుతం పలు చిత్రాలలో అమ్మగా, అక్కగా, సోదరిగా అలరిస్తోంది జయసుధ. ఈమె శోభన్ బాబు గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. నా సినీ కెరీర్ లో ఎక్కువ సినిమాలు ఆయనతోనే చేశాను.. కానీ ఆయన నుండి ఒక్క విషయం నేర్చుకోలేకపోయాను. అని జయసుధ చెప్పుకొని బాధపడుతోంది. ఇంతకు ఆ విషయం ఏమిటంటే ..శోభన్ బాబు గారు తాను సంపాదించిన డబ్బులు దేని మీద పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందనే విషయంలో హీరో శోభన్ బాబు తర్వాతే ఎవరైనా అని తెలియజేస్తోంది జయసుధ. ఎందుకంటే ఆయన సంపాదన సొమ్మునంత ఎక్కువగా భూముల మీదే పెట్టుబడిగా పెట్టేవారట.

cash show latest promo, Jayasudha: శోభన్ బాబు డార్లింగ్.. కృష్ణ నా అంకుల్:  నటి జయసుధ - actress jayasudha interesting comments about sobhan babu and  krishna in cash show latest promo - Samayam Telugu

ఒక షూటింగ్ కారణంగా ఇద్దరూ కలసి ఒకే కారులో వెళ్తున్న సమయంలో శోభన్ బాబు,జయసుధ తో ఇలా అన్నారట.. అలా కారులో నుంచి చూపిస్తూ.. అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని చూపించారట. ఆ స్థలాన్ని చూపించి మీ నాన్నగారితో మాట్లాడి ఆ స్థలాన్ని తీసుకోమని సలహా ఇచ్చారట..అప్పుడు ఆ స్థలాన్ని జయసుధ భర్త చూసి ఇది పట్టణానికి దూరంగా ఉంది.దీనిమీద ఇన్వెస్ట్ చేయమంటున్నారెంటి అని జయసుధ భర్త అన్నట్లుగా తెలియజేసింది.

దీంతో జయసుధ కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదట. ఇప్పుడు ఆ స్థలం కాస్త మద్రాస్ లో అందానగర్ గా ఈరోజు కొన్ని కోట్లు పలుకుతోందనీ తెలియజేసింది జయసుధ.ఆరోజు శోభన్ బాబు మాట వినకుండా పలు సినిమాలలో పెట్టుబడులు పెట్టడం వల్ల చాలా నష్టపోయారని తెలియజేసింది జయసుధ. శోభన్ బాబు మాట వినుంటే ఈరోజు తన పరిస్థితి మరొక లాగా ఉండేదని ఒక ఇంటర్వ్యూలో తెలియజేసినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *