సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ అనేవి కామన్.. ఎవరైనా ఇద్దరు ఆడ మగ కలిసి కనిపిస్తేనే చాలు వారి మధ్య ఏదో అఫైర్స్ అల్లేస్తారు. ఇక అలాంటి సినిమా ఇండస్ట్రీ లో అయితే అవి చాలా కామన్. కనీసం పక్క పక్కన కూర్చున్నా కూడా ఏవేవో కథలు అల్లేస్తారు ఎఫైర్లు అంటగడతారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాటి. ఈమెను మొదట్లోనే అందరూ ఐరన్ లెగ్ అని ముద్రవేశారు.

కానీ తన అందం,అభినయంతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే లావణ్య త్రిపాటి మెగా హీరో వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది అంటూ ఎన్నో వార్తలు వీరి గురించి ఇప్పటికే వినిపించాయి. అలాగే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఇప్పటికే లావణ్య త్రిపాఠి ఖండించింది. అలాంటి ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పినా కూడా రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

ఇక ఆమె మీద వచ్చే రూమర్స్ ఆగపోవడానికి ప్రధాన కారణం వరుణ్ తేజ్ కి తనకి మధ్య ఎన్ని రూమర్స్ వచ్చినా కూడా ఆమె వాటిని పట్టించుకోకుండా పదేపదే ఆయనతోనే మళ్ళీ క్లోజ్ గా ఉండడంతో ఇక ఈ విషయంలో వీరిద్దరూ లవ్ లో ఉన్నారు అని అందరూ భావిస్తున్నారు. అలాగే ఎవరు ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసిన నా ఇష్టం నాది అన్న తీరుగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి నైట్ పార్టీలు అంటూ చాలానే ఎంజాయ్ చేస్తోంది. అలాగే నిహారిక పెళ్లిలో అన్ని కార్యక్రమంలో కనిపించడంతో వీరి విషయంలో మరింత అనుమానం వచ్చింది.

అయితే తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి రహస్యంగా కలిసినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తతో ఇన్ని రోజులు మా మధ్య ఏమీ లేదు అని చెప్పుకుంటూ వచ్చినా లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటి కోడలు కాబోతోంది కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకుంటే గనుక అది పెద్ద సెన్సేషనల్ అవుతుంది. ఇక ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *