యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్ హీరోగా సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సనా తెర‌కెక్కించిన `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అందాల భామ.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. అలాగే యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత కృతి శెట్టి నటించిన `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలు సైతం మంచి విజయం సాధించాయి.

దీంతో కృతి శెట్టి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. గోల్డెన్ లెగ్ అంటూ ఆమెను అమాంతం ఆకాశానికి ఎత్తేశారు. కానీ కృతి శెట్టి స‌క్సెస్ జోరును కొనసాగించలేకపోయింది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఈ భామ.. `ది వారియర్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్రాలతో వరస ఫ్లాపులను మూట‌గ‌ట్టుకుంది. అయితే ఎన్ని అపజయాలు ఎదురైనా ఈ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం తెలుగులో అక్కినేని నాగచైతన్యకు జోడిగా `కస్టడీ` అనే సినిమాలో నటిస్తోంది. వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపొందిస్తున్నారు. అలాగే తమిళంలో స్టార్ హీరో సూర్యకి జోడిగా `అసురుడు` అనే సినిమా చేస్తుంది. మరోవైపు మలయాళంలోనూ ఈ ముద్దగుమ్మ‌ ఓ ప్రాజెక్ట్ కు సైన్‌ చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా కృతి శెట్టి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. వాస్తవానికి కృతి శెట్టి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేయాల్సిందట.

ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `రంగస్థలం`. ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా కొత్త భామ‌ను ఎంపిక చేయాలని సుకుమార్ భావించారట. ఈ క్రమంలోనే కృతి శెట్టి ఫోటోలను సైతం పరిశీలించారట. కానీ అప్పటికి ఆమె వయసు చాలా చిన్నది. అందువల్ల ఆమెను సుకుమార్ రిజెక్ట్ చేశారట. ఫైనల్ గా సమంతను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇక రంగస్థలం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇక రంగస్థలం సినిమాకు కృతి శెట్టిని రిజెక్ట్ చేసిన సుకుమార్‌.. `ఉప్పెన‌` సినిమాకు స్వ‌యంగా సూచించారట. మొత్తానికి రామ్ చరణ్ సినిమాను మిస్ చేసుకున్న‌ కృతి శెట్టి.. వైష్ణ‌వ్ మూవీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టింద‌ని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *