సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కో విధానంలో కథను తెరకెక్కిస్తారు. కొంతమందేమో రొమాంటిక్ కథలు తెరకెక్కిస్తే మరి కొంతమందేమో యాక్షన్ సన్నివేశాలు ఉండే కథలు తీస్తారు. ఇంకొంతమంది హార్రర్ మూవీస్ తీస్తారు. ఇలా ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇక టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ (PURI JAGANNADH)అనగానే మాస్ హీరో హీరోయిన్ల కథ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

అలాగే రాఘవేంద్రరావు అనగానే హీరోయిన్ ని చాలా రొమాంటిక్ గా చూపిస్తారు. ఇక ఇవివి సత్యనారాయణ అనగానే మనకు కుటుంబ కథ నేపథ్యం, ఎమోషన్స్, కామెడీ ఇవన్నీ గుర్తుకువస్తాయి. ఈవివి సత్యనారాయణ(EVV SATHYANARAYANA) తన అద్భుతమైన కథలతో తన సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ని పండించి ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు. ఇక ఈయన సినిమా అంటే అందులో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు.

అయితే కొంతమంది డైరెక్టర్లకు కొందరు హీరోయిన్లను తమ సినిమాలో పెట్టుకుంటే ఆ సినిమా కు కలిసి వస్తుంది. దాంతో ఆ డైరెక్టర్లు తాము తెరకెక్కించే చాలా సినిమాల్లో ఆ లక్కీ హీరోయిన్ నే పెట్టుకుంటారు. ఇక అలాంటి లక్కీ కాంబినేషన్ ఇవివి సత్యనారాయణ శ్రీకాంత్ (SRIKANTH)భార్య ఊహలది. ఊహ హీరోయిన్ గా కన్నడ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చినప్పటికి తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ హీరోయిన్ ఇవివి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఆమె అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమాలో ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ సినిమా తర్వాత ఊహ(UHA) వరుసగా సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ మాత్రం నేను దర్శకత్వం వహించే సినిమాలో హీరోయిన్ ఊహ ఏడిస్తే నాకు కచ్చితంగా కలిసి వస్తుంది. ఆమె ఏడుపే నా సినిమా కు చాలా ప్లస్..నా సినిమా హిట్ అవుతుంది అంటూ అప్పట్లో చెప్పేవారట. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ ఎమోషనల్ గా మంచి హిట్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *