ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఇండియా న్యూజీలాండ్ (India vs Newzeland) వన్ డే సిరీస్ తొలి మ్యాచ్ లో టీం ఇండియా దారుణంగా ఓడిపోయింది. ఇప్పటికే టీ 20 (T20) సిరీస్ ను కైవసం చేసుకున్న టీం ఇండియా వన్ డే సిరీస్ ను చేజిక్కించుకోవాలని బరిలోకి దిగింది. అయితే మంచి స్కోర్ చేసినప్పటికీ దానిని డిఫెండ్ చేయడం లో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయారు బౌలర్లు.

మొదట్లో మంచి బౌలింగ్ స్పెల్స్ వేసినా ఆ తర్వాత న్యూజీలాండ్ ఆటగాళ్ల ఆటతీరును టీం ఇండియా తలొగ్గక తప్పలేదు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్ళైనా కేన్ విలియమ్సన్ (Kane Williamson) అలాగే టిమ్ లేతమ్ ఇద్దరు డబల్ సెంచరీ పార్ట్నర్ షిప్ తో గెలిపించారు. దాంతో ఇప్పుడు టీం ఇండియా పై భారం నెలకొంది అని చెప్పొచ్చు. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పకుండా రెండో మ్యాచ్ లో గెలవాల్సిన పరిస్థితి. ఇప్పటికే దానికి సంబందించిన వ్యూహాలను రచిస్తున్నారు.

ఇకపోతే ఈ రెండో మ్యాచ్ లో ఓడిపోతే టీం ఇండియా రెండు ఎదురుదెబ్బలు తగిలినట్లే అవుతుంది. ఒకటి ఈ సిరీస్ ను కోల్పోవడంతో పాటు రెండోది ఈ మ్యాచ్ ఓడిపోతే ఐసీసీ వరల్డ్ కప్ సూపర్ లీగ్ పాయింట్ (ICC World Cup Super League Points table) ల టేబుల్ లో అగ్రస్థానం కూడా కోల్పోతుంది. ప్రస్తుతం భారత్ ఖాతా లో 129 పాయింట్లు ఉన్నాయి. ఒక్క విజయానికి పది పాయింట్లు లభిస్తాయి. అలా పెనాల్టీ ఓవర్ కారణంగా 130 ఉండాల్సిన టీం ఇండియా పాయింట్లు 129 ఉన్నాయి. ఒకవేళ ఈ మ్యాచ్ న్యూజిలాండ్ గెలిస్తే మాత్రం 130 కి చేరుకుంటుంది.

అప్పుడు టీం ఇండియా రెండో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ రద్దయితే మాత్రం చెరో ఐదు పాయింట్ల తో టీం ఇండియా అగ్రస్థానంలో ఉంటుంది. ఏదేమైనా ఇటు సిరీస్ సజీవంగా ఉండాలన్నా, అగ్రస్థానం కోల్పోకుండా ఉండాలన్నా తప్పకుండా ఈ మ్యాచ్ లో టీం ఇండియా గెలవాల్సిందే. మరి గబ్బర్ (Shikhar Dhawan) నేతృత్వంలోని టీం ఏవిధంగా రెండో మ్యాచ్ లో విక్టరీ ని సాధిస్తుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *