సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లిదండ్రులు ఇద్దరూ కేవలం నెల వ్యవధిలోనే మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ చాలా విషాదంలో మునిగిపోయింది. నవంబర్ 15న కృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం కన్నీళ్లు పెట్టుకుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మహేష్ బాబు తన తల్లిదండ్రులు చనిపోయినా కూడా తల వెంట్రుకలు తీసుకోలేదు. అయితే ఈ విషయంలో మహేష్ బాబు ఎందుకు అలా చేసాడు అంటూ అందరూ సోషల్ మీడియా వేదిక కామెంట్స్ చేస్తున్నారు.

ఇక విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి వృద్ధాప్య కారణంగా అలాగే అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. అలాగే కృష్ణ గారు కూడా హార్ట్ ఎటాక్ ప్రభావం మిగతా బాడీ పార్ట్స్ మీద పడడంతో ఆయన కూడా మరణించారు. ఇక ఆయన మరణించాక ఆయన అంత్యక్రియలు మహాప్రస్థానంలో చేయడం వల్ల మహేష్ బాబు చాలా విమర్శల పాలయ్యారు. అయితే మరోసారి మహేష్ బాబు మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. అవేంటంటే.. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన కూడా కర్మకాండలు పూర్తి చేశారు.

కానీ గుండు మాత్రం తీయించుకోలేదు ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు మరణిస్తే ఖచ్చితంగా గుండు చేయించుకొని కర్మ కాండలు చేస్తారు. కానీ మహేష్ బాబు మాత్రం అలా చేయకుండానే కర్మకాండలు పూర్తి చేశారు. అయితే మహేష్ బాబు తన వెంట్రుకలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణం నెక్స్ట్ ఆయన తీయబోయే సినిమాలే. ఇప్పటికే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా సెట్స్ మీద ఉంది. అయితే ఈ టైంలో మహేష్ బాబు గుండు చేయించుకుంటే మళ్లీ వెంట్రుకలు రావడానికి ఆరు నెలల టైం అయినా పడుతుంది.

ఆరు నెలలు అంటే చాలా లాంగ్ అవుతుంది. ఇక మరొక కారణమేంటంటే మహేష్ బాబు కి జుట్టు చాలా పల్చగా ఉంటుంది. ఆయన ఇప్పటికే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. ఇక ఈ టైంలో జుట్టు తీసి మూవీ యూనిట్ ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఆయన గుండు తీయించుకోలేదు. అలాగే గుండు తీయించుకుంటే ఆయన లుక్ పై చాలా విమర్శలు వస్తాయి. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మహేష్ బాబు తల్లిదండ్రులు చనిపోతే గుండు తీయించుకోలేదు అని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో కొంతమంది మహేష్ బాబు ని సపోర్ట్ చేస్తే ఇంకొంతమంది మాత్రం మహేష్ బాబు పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *