సీనియర్ లెజెండ్రీ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న దాసరి నారాయణరావు గురించి.. ఆయన ప్రతిభ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఉండే 24 విభాగాలలో కూడా మంచి ప్రావీణ్యం పొందిన దాసరి నారాయణరావు గారు రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తం దాసరి నారాయణరావును పెద్ద దిక్కుగా భావిస్తే .. దాసరి మాత్రం మహానటి సావిత్రినీ పెద్దదిక్కుగా భావించేవారు మహానటి సావిత్రి అంటే దాసరికి ఎనలేని అభిమానం.. సొంత అక్కయ్యలా ఫీలయ్యే..దాసరి నారాయణరావు సావిత్రిని అక్కయ్య అంటూ నోరారా ఆప్యాయంగా పిలిచేవారు.

తన కెరియర్ మొదట్లోనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వీఆర్, శోభన్ బాబు వంటి పెద్ద నటులతో సినిమాలు తీసిన దాసరి నారాయణరావు ఎందుకో సావిత్రితోనే ఆయనకు విడదీయలేని బంధం ఏర్పడింది. పలుమార్లు ఆయన సావిత్రి పై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పారు. ముఖ్యంగా సావిత్రిని తాను అక్క అని పిలుస్తానని.. ఆమె తనను తమ్ముడు అని ప్రేమగా పిలుస్తారని కూడా దాసరి నారాయణరావు వెల్లడించారు.. వింత కాపురం అనే సినిమాలో మొదటిసారి చేస్తున్నప్పుడు సావిత్రి గారిని చూశాను.. ఆ సినిమా సెట్ లోని మొదటిసారి మాట్లాడాను అని దాసరి తెలిపారు.

అప్పటినుంచి ప్రతిరోజు సావిత్రి అక్కను పలకరించే వాడిని అని గతంలో ఒక ఇంటర్వ్యూలో దాసరి తెలిపారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగిన సావిత్రి అప్పటికే ఆర్థికంగా బాగా చితికిపోయారని.. తన కష్టాలన్నీ చెప్పుకునే వారని తెలిపారు దాసరి . అందుకే తాను చేసే ప్రతి సినిమాలో కూడా సావిత్రికి కచ్చితంగా ఒక పాత్ర ఇచ్చే వాడిని 15 సినిమాలలో ఆమెకు అవకాశం ఇచ్చానని దాసరి వెల్లడించారు. 1981 మే 4వ తేదీన నా పుట్టినరోజు అయితే ఆ రోజు సావిత్రి తన మెడలోని బంగారు గొలుసును తీసి నాకు బహుమతిగా ఇచ్చారు అని గుర్తు చేసుకున్నారు దాసరి.

ఆ తర్వాత ఆమె బెంగళూరు వెళ్ళిపోవడం.. కొన్ని రోజులకే కాలుజారి కింద పడడం.. ఆస్పత్రిపాలవడం అన్నీ జరిగిపోయాయి. ఈ బాధ నుంచి తేరుకునే లోపే ఆమె తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది.. అక్కయ్య మరణం నన్ను తీవ్రంగా కలిసి వేసింది అంటూ దాసరి నారాయణరావు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *