బుల్లితెర మీద దాదాపు 10 సంవత్సరాలకు పైగా జబర్దస్త్ (JABARDASTH)కామెడీ షో వస్తోంది.ఈ షో మొదట్లో ఎవరు చూడకపోయినా ఆ తర్వాత రానురాను రేటింగ్ పెరిగి ప్రతి ఒక్కరూ జబర్దస్త్ అంటే పడచస్తున్నారు. ఈ షోలో చేసే కామెడీకి చాలామంది జనాలు అట్రాక్ట్ అయ్యారు. దాంతో కొద్దిరోజుల్లోనే ఈ షో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక ఈ షో వల్ల చాలామంది కమెడియన్లకు మంచి లైఫ్ దొరికింది. అలాగే రష్మీ,అనసూయ వంటి యాంకర్లు కూడా స్టార్ యాంకర్లుగా ఇండస్ట్రీలో ఎదిగారు.

ఇక ఈ షో కి ఎంతోమంది కమెడియన్ లు వస్తూపోతూ ఉన్నారు. ఇక జబర్దస్త్ షో రేటింగ్ ని పడగొట్టడానికి కామెడీ స్టార్స్, అదిరింది వంటి కామెడీ షోలు వచ్చినప్పటికీ జబర్దస్త్ షోని బీట్ చేయలేకపోయాయి.ఇక తాజాగా అనసూయ(ANASUYA) ప్లేస్ లోకొత్త యాంకర్ గా సౌమ్యరావు వచ్చింది. ఇక ఈమె ఇంతకుముందే సీరియల్స్ ద్వారా అందరికీ తెలుసు. ఇక సౌమ్య రాయ్ కూడా తన యాంకరింగ్ తో ఈ షోకి మరింత రేటింగ్ పెంచేలా చేస్తోంది. ఈ కొత్త యాంకర్ కన్నడ అమ్మాయి కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో మంచి ఆదరణ లభిస్తుంది.

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక న్యూస్ ప్రకారం జబర్దస్త్ లో ఉండే ఓ టాప్ కమెడియన్ సౌమ్యరావు ని లవ్ లో పడేయాలని చూస్తున్నాడట. దాంతో ఆ వ్యక్తి తన పిచ్చిపిచ్చి చేష్టలతో ఆమెను చాలా టార్చర్ చేస్తున్నాడట. సౌమ్యరావు(SOUMYA RAO) జబర్దస్త్ లోకి వచ్చి కొన్ని రోజులే అవుతున్నప్పటికీ ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని చాట్ చేస్తూ..డిన్నర్ కి వస్తావా.. షాపింగ్ కి వస్తావా.. అంటూ ఇలా ప్రతిసారి ఆమెను విసిగిస్తున్నాడు అంటూ ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఆ కమెడియన్ మాట్లాడే మాటలు సౌమ్యరాయ్ కి నచ్చకపోయినప్పటికీ ఆ వ్యక్తి మాత్రం ఆమెను విసిగిస్తూనే ఉన్నాడట.

ఇక ఈ విషయం తెలిసిన మల్లెమాల (MALLEMALA)యాజమాన్యం ఆ కమెడియన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. నువ్వు షో లో ఉన్నప్పుడు ఎలాంటి కామెడీ చేసినా ఎన్ని వేషాలు వేసినా పర్వాలేదు అది కేవలం స్క్రీన్ వరకే ఉండాలి.అంతేకానీ ఆఫ్ స్క్రీన్ లో కూడా ఆమెను విసిగిస్తానంటే మాత్రం బాగోదు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు అంటూ సీరియస్ గా ఆ వ్యక్తికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక మల్లెమాల యాజమాన్యం ఇచ్చిన వార్నింగ్ ని దృష్టిలో పెట్టుకొని ఆ వ్యక్తి తన బిహేవియర్ మార్చుకుంటాడో లేదో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *