బుల్లితెర రియాలిటీ షోలలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నటువంటి షో లలో బిగ్ బాస్(BIGGBOSS) టాప్ పొజిషన్ లో ఉంది.. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 5 సీజన్లు, ఒక ఓటీటీ నాన్స్టాప్ సీజన్ పూర్తి చేసుకొని ప్రస్తుతం ఆరో సీజన్లోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది. ఈ సీజన్ కూడా చివరి అంకానికి చేరుకుంది అని చెప్పవచ్చు. ఈ సీజన్ పూర్తయ్యే సమయం వస్తున్నా కొద్దీ హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య జోరు మరింత పెరుగుతోంది. ఈ తరుణంలోనే అనుకోని ఎలిమినేషన్స్ జరుగుతూ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఏ సీజన్ లో చూసినా ఓ సీజన్ బాయ్ ఫ్రెండ్, మరో సీజన్ అతని గర్ల్ ఫ్రెండ్ ను కంటెస్టెంట్స్ గా పార్టిసిపేట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయం చెప్పేముందు అందరికీ గుర్తుకు వచ్చేది శ్రీహాన్ సిరి(SIRI)నే.. ఎందుకంటే అయిదవ సీజన్లో పార్టిసిపేట్ చేసింది సిరి, ఫైనల్ దాకా వెళ్ళింది. కానీ ప్రస్తుత సీజన్లో శ్రీహాన్ బాగానే ఆడుతున్నారు. టాప్ 5 కంటెస్టెంట్లలో ఉంటాడని అనుకోవచ్చు. తాజాగా హౌస్ లోకి వచ్చిన సిరి, శ్రీహాన్ తో కలిసి స్టెప్పులేసింది.

ఇది జరిగి రెండు రోజులైనా కాకముందే సోహెల్ వీరిపై పంచ్ వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియా వేదిక వైరల్ గా మారింది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఒక్కో వారం ఒక్కో కంటెస్టెంట్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ వస్తున్నారు. ప్రస్తుతం వీకెండ్ వచ్చేసింది కాబట్టి, హౌస్ మేట్స్ కి వారి ఫ్రెండ్స్ ని షో కి తీసుకొచ్చారు. ఆ విధంగా శ్రీహాన్ కొసం అతడి తండ్రి తో పాటు బిగ్ బాస్ మొదటి సీజన్లో విన్నర్ అయిన శివ బాలాజీ వచ్చారు. శ్రీహాన్ పై పంచులు కూడా వేశారు.. అయితే ఇనయా కొరకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన సోహెల్(SOHEL).. హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ చాలా ఎంటర్టైన్ చేశాడు.

ఇక శ్రీహన్ తో మాట్లాడుతూ.. సిరి టాటూ పర్మినెంట్ కాదు, మోసపోవద్దంటూ ఫన్నీ గా కామెంట్ చేశారు.. ఈ విధంగా హౌస్ లో రచ్చ రచ్చ చేసిన తాజా ప్రోమో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇది బిగ్ బాస్ అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటీవల హౌస్ లోకి వచ్చిన సిరి శ్రీహాన్ (SRIHAAN)పేరుని మెడ పై టాటూ వేసుకున్నట్టు కెమెరా లో చూపించారు. ఇది నేటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం సోహెల్ చేసిన ఫన్నీ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *