ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ప్రసారమౌతూ ఎంతో అద్భుతమైన ప్రేక్షకు ఆదరణ సంపాదించుకున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ కార్యక్రమము గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ ఇప్పుడు ఆరవ సీజన్ ప్రసారమవుతూ చివరి దశకు చేరుకుంది. రేపటితో 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం చివరి దశకు రావడంతో ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్లో చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు అనే విషయం కూడా బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

మునుపటి సీజన్ల కంటే ఈసారి బిగ్ బాస్ ఆరవ సీజన్ గ్రాండ్ ఫినాలే చాలా ఘనంగా నిర్వహించడానికి బిగ్బాస్ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే గత సీజన్లలో ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలే కి చీఫ్ గెస్ట్ గా ఎవరూ రాలేదు. హోస్ట్ నాగార్జున నే విజేతను నేరుగా ప్రకటించారు. అయితే మూడు, నాలుగు సీజన్లలో ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరై పెద్ద ఎత్తైన సందడి చేసి కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కోసం ఎవరు రాబోతున్నారు అనే వార్త వైరల్ గా మారుతోంది.

సీజన్ సిక్స్ కోసం బిగ్ బాస్ నిర్వాకులు ఒక స్టార్ హీరోని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు సమాచారం. బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోసం టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో నందమూరి బాలకృష్ణను చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలకే పరిమితమైన బాలకృష్ణ ఇటీవలే బుల్లితెరపై తన సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆహాలో ఈయన చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఇలా కార్యక్రమాల ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బాలకృష్ణను బిగ్బాస్ సీజన్ సిక్స్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగాని విజేతను ప్రకటించి.. ట్రోఫీ అందించనున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆరోజు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *