నటసింహం బాలకృష్ణ గురించి.. ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటించి ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ వరుస సినిమాలను ప్రకటిస్తూ కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాదు ఇన్నాళ్లు ఇండస్ట్రీకే పరిమితమైన బాలకృష్ణ.. ఇప్పుడు బుల్లితెరపై కూడా తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు. గత ఏడాది ఆహా తెలుగులో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరించి సినీ సెలబ్రిటీల ను ఇంటర్వ్యూ చేసిన బాలయ్య ఇప్పుడు రెండవ సీజన్ కూడా మొదలు పెట్టేసాడు. అయితే ఈసారి పొలిటికల్ టచ్ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

radhika sarathkumar, పాప పుట్టిన 2 నెలలకే షూటింగ్‌కు వెళ్లా.. అక్కడ నా  తలరాత మారిపోయింది: రాధిక - balakrishna says radhika sarathkumar left for  shooting two months after her daughter was born ...రెండవ సీజన్లో భాగంగా మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు.. ఆయన కొడుకు నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరవగా.. ఇప్పుడు నాలుగవ ఎపిసోడ్ కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గెస్ట్లుగా హాజరయ్యారు. వీరితోపాటు సీనియర్ హీరోయిన్ రాధిక కూడా హాజరవ్వడం జరిగింది . అలా నలుగురి మధ్య సంభాషణ విపరీతంగా ఆకట్టుకుందని చెప్పాలి.

అయితే బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో లో సందడి చేసిన రాధికను ఒక ప్రశ్న అడిగి ఆమెను ఇరకాటంలో పెట్టేశారు. రాధికను ఇంటర్వ్యూ చేస్తూ ..”చిరంజీవిలో నచ్చనిది ఏంటి? నాలో నచ్చేది ఏంటి ?”అంటూ ఆమెను అడిగాడు. అయితే ఆమె దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది. ఈ ప్రశ్నలకు రాధిక బదులిస్తూ.. “నీతో నేను ఎప్పుడూ గొడవ పడను.. కానీ చిరంజీవి, నేను ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాము. నేను ఎక్కువగా మాట్లాడతానని, నన్ను తిడుతూ ఉంటాడు. నేను తిరిగి తిడుతూ ఉంటాను. అలా మా ఇద్దరి మధ్య ఎప్పుడు గొడవ జరుగుతూనే ఉంటుంది. మేమిద్దరం ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాము.

మా ఇద్దరి మధ్య చిరంజీవి భార్య సురేఖ ఎంపైర్ లా ఉంటుంది. చిరంజీవితో సరదా మామూలుగా ఉండదు అసలు..” అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి అయితే బాలకృష్ణతో పోల్చితే చిరంజీవితోనే తనకు అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పకనే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *