న్యాచురల్ స్టార్ నాని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా సహజ నటనతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడీయన. ఒకే తరహా సినిమాలు కాకుండా..విభిన్నమైన కథల‌ను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఎంట‌ర్టైన్ చేస్తున్నారు. గత ఏడాది ఈయన `శ్యామ్ సింగ‌రాయ్‌` సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

అదే జ్యోష్‌లో నాని ఈ ఏడాది ఆరంభంలో `అంటే.. సుందరానికి` తో అలరించే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం నాని `దసరా` అనే మూవీ చేస్తున్నాడు. నాని కెరీర్ లో తొలిసారి పూర్తి స్థాయి మాస్ పాత్రను చేస్తున్న చిత్రమిది. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంటే.. సాయి కుమార్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాది మార్చ్ లో ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మ‌ల‌యాళ‌, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

అదేంటంటే ఈ సినిమాలో కీర్తి సురేష్ కంటే ముందు ఓ స్టార్ హీరోయిన్ ను మేక‌ర్స్‌ సంప్రదించారట. కానీ ఆమె నాని పొట్టిగా ఉంటాడు.. ఆయనతో నేను నటించ‌ను అని ద‌స‌రా సినిమాకు నో చెప్పింద‌ట‌. నాని సహజంగానే కాస్త పొట్టిగా‌ ఉంటాడు. అయితే ఆయనకు హైట్ అనేది ఎప్పుడూ సమస్య కాలేదు. అలాంటిది ఓ హీరోయిన్ పొట్టిగా ఉన్నాడని కారణం చెప్పి నానితో సినిమా చేయ‌న‌ని చెప్పడం ఆయన అభిమానులు తీవ్రంగా హర్ట్ అయ్యేలా చేసింది. దీంతో సదరు హీరోయిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత తలపొగురు అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి నిజంగానే నాని పొట్టిగా ఉన్నాడ‌నే కారణంతో ఓ హీరోయిన్ ద‌స‌రాను రిజెక్ట్ చేసిందా..? లేక ఇది ఒక పుకారేనా..? అన్నది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *