యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ ప్రామిసింగ్ హీరో అడివి శేష్ హీరోగా నటించిన సినిమా హిట్2. దీనికి కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించగా వాల్ పోస్టర్ సినిమాపై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది. అడివి శేష్ పార్ట్ 2లో నటించడంతో ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. అంతే కాకుండా రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింతగా పుంచేసింది.

మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని డిసెంబర్ 2న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అత్యంత కిరాతకంగా హత్యలు చేసే సైకో కిల్లర్ని వెతుక్కుంటూ వెళ్లే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అడివి శేష్ నటించిన మూవీ ఇది. ట్రైలర్ తో ఒళ్లు గగుర్పోడిచే సన్నివేశాలతో ఈ మూవీ సాగుతుందని క్లారిటీ ఇచ్చేసిన ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఫైనల్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసింది.

శనివారం ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫైనల్ గా ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు అత్యధికంగా వుండటంతో సెన్సార్ వారు ఈ మూవీకి ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *