బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముద్ర ఖ‌ని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల త‌దిత‌రులు న‌టిస్తోన్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ధన్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హ‌ర్ష పులిపాక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది.

నేడు ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసి, చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ‘పంచతంత్రం’… 5 జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని ట్రైలర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు ‘పంచేద్రియాలు’ అనే పేరు పెట్టి, ఆ సీన్ తో ప్రేక్షకులను సినిమాలోకి తీసుకెళతారు.

జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి… సంతోషాలే కాదు… బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం… మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ఎలా ముందుకెళ్లామ‌నేది ‘పంచతంత్రం’ క‌థాంశం అని క్లియ‌ర్‌గా తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *