పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రభాస్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో `సలార్‌`, నాగ అశ్విన్ డైరెక్షన్ లో `ప్రాజెక్ట్ కె` చిత్రాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇవి పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్` అనే చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు.

ఇక వీటితో పాటు మారుతి దర్శకత్వంలో ప్ర‌భాస్‌ ఓ సినిమా చేస్తున్నాడంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా.. హైద‌రాబాద్ లో షూటింగ్ స్టార్ట్ అయిందనే టాక్ ఉంది. ఈ సంగతి పక్కన పెడితే ప్రభాస్ లుక్ పై గత కొంతకాలం నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకప్పుడు సూపర్ హ్యాండ్సమ్ గా కనిపిస్తూ భారీ అభిమానులు సంపాదించుకున్న ప్రభాస్.. ఈ మధ్య కాలంలో బాగా మారిపోయాడు.

ఆయన ముఖంలో మునుపటి కల ఏమాత్రం కనిపించడం లేదు. పైగా కొద్ది రోజుల నుంచి ఎక్కడకు వెళ్లిన తన హెయిర్ ను కవర్ చేస్తూ క్యాప్ పెట్టుకోవడం పై గట్టిగా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సినిమా ఈవెంట్స్ లో క్యాప్ తోనే దర్శనమిస్తున్నాడు. ఇక ఇటీవల లెజెండ్రీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ కు నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు కూడా హెయిర్ కనిపించకుండా క్యాప్ తోనే కవర్ చేసుకున్నాడు.

దీంతో నెటిజ‌న్లు మరియు యాంటీ ఫ్యాన్స్ ప్రభాస్‌కు బట్టతల వచ్చేసిందా..? అందుకే ఇలా క్యాప్ తో కవర్ చేస్తున్నాడా..? అంటూ సోషల్ మీడియా ద్వారా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా ఎప్పుడూ క్యాప్ లో చూడ‌లేక‌పోతున్నామంటూ సొంత అభిమానులు సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ క్యాప్ ధరించడం వెనక ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. ప్రభాస్ హెయిర్ లాస్ తో బాగా ఇబ్బంది పడుతున్నాడని.. హెయిర్ కేర్ లో భాగంగా ఇలా క్యాప్ ధరిస్తున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారాల్లో ఏది నిజం..? డార్లింగ్ ఎందుకు త‌ర‌చూ హెయిర్ క్యాప్ ధ‌రిస్తున్నాడు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఎప్ప‌టికి వ‌స్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *