ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే సినిమాలలో మాత్రమే హీరోలు, హీరోయిన్స్ ఇతరులను ఆపదలో నుంచి కాపాడినట్లు మనకు చూపిస్తారు . కానీ రియల్ లైఫ్ లో వాళ్లు బయటకి వస్తే మాత్రం అభిమానుల భారీ నుంచి తమను తాము కాపాడుకోవాలి అంటే వారికి తప్పకుండా బాడీగార్డ్ అవసరం అవుతాడు. ఈ క్రమంలోనే ఎంత స్టార్ హీరో అయినా.. ఎంత స్టార్ హీరోయిన్ అయినా సరే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారు బయటకు వచ్చినప్పుడు అభిమానుల ప్రేమానురాగాలను తట్టుకోలేక సతమతమవుతూ ఉంటారు. అలాంటప్పుడు వీరికి రక్షణగా బాడీగార్డ్స్ నిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో అభిమానులు చేసే పనుల వల్ల సెలబ్రిటీలను రక్షించడానికి బాడీగార్డ్స్ కి కత్తి మీద సామూలాంటిది.

అందుకే అభిమానుల నుంచి వాళ్లకు రక్షణ కల్పించే బాడీగార్డ్లకు కూడా భారీ పారితోషకం అందిస్తున్నారు మన సెలబ్రిటీలు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కొంతమంది స్టార్ ఇమేజ్ ఉన్న హీరో హీరోయిన్స్ కి బాడీగార్డ్ లుగా రక్షణ కల్పిస్తున్న వారికి ఎంత పారితోషకం ఇస్తున్నారు అనేది సంచలనంగా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

అమితాబ్ బచ్చన్:
బాలీవుడ్ మెగాస్టార్ అయిన అమితాబ్ బచ్చన్ బాడీ గార్డ్ జితేంద్ర షిండే గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అమితాబ్ బచ్చన్ కి సెక్యూరిటీ అందివ్వడమే కాదు ఆయన ఆరోగ్య విషయంలో కూడా జితేంద్ర చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. ఇంత ప్రేమను చూపిస్తున్న జితేంద్రకు అమితాబ్ బచ్చన్ సంవత్సరానికి రూ.2 కోట్ల పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.

షారుక్ ఖాన్:
షారుక్ ఖాన్ బాడీ గార్డ్ రవి సింగ్ అందరికంటే ముందుంటాడు. రవి సింగ్ కి షారుక్ ఖాన్ ఏడాదికి రూ.2.7 కోట్లు పారితోషకం అందిస్తున్నాడు.

సల్మాన్ ఖాన్:
సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షేరా.. అతడికి కేవలం బాడీగార్డ్ మాత్రమే కాదు మంచి స్నేహితుడు కూడా.. షేరాకు సల్మాన్ ఖాన్ సంవత్సరానికి రూ.2 కోట్ల పారితోషకం ఇస్తున్నాడు.

అమీర్ ఖాన్ :
అమీర్ ఖాన్ బాడీ గార్డ్ యువరాజ్ సంవత్సరానికి రూ.2 కోట్లు పారితోషకం తీసుకుంటున్నాడు.

అక్షయ్ కుమార్:
అక్షయ్ కుమార్ తన బాడీగార్డ్ కి రూ.1.2 కోట్ల పారితోషకం అందిస్తున్నాడు.

దీపికా పదుకొనే:
స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన బాడీగార్డ్ జలాల్ కు సంవత్సరానికి రూ.1.2 కోట్ల పారితోషకం అందిస్తోంది. ఆమె వద్ద బాడీగార్డ్ గా పనిచేస్తున్న జలాల్ ఆమె అతడిని సొంత సోదరుడిగా భావిస్తూ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *