సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ అనే పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది నయనతార మాత్రమే. నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.. ఇందులో ముఖ్యంగా నయనతార అంటే తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ. అలాంటి వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.. ఇక అప్పటినుంచి నయనతార విగ్నేష్ శివన్ గురించి సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

మొన్నటికి మొన్న వీరికి కవలలు పుట్టారనే పోస్ట్ పెట్టడంతో ఆ కవలల విషయం లో పెద్ద గొడవనే జరిగింది.జూన్ లో పెళ్లి జరిగితే ఇద్దరు కవలలు ఏ విధంగా పుట్టారు అని చాలామంది అడిగారు. సరోగసి ద్వారా పిల్లలం కన్నామని వారు చెప్పడంతో సరోగసి అనేది ఇండియా లో బ్యాన్ చేశారు కదా ఈ విధంగా చట్ట విరుద్ధమైన పని మీరు ఎలా చేశారు అంటూ చాలామంది కేసులు కూడా వేశారు. చివరికి ఈ జంట ఎలాగోలా ఆ వివాదం నుండి బయటపడింది. కానీ తాజాగా మరో విషయం బయటకు వచ్చింది.

అదేంటయ్యా అంటే.. విగ్నేష్ తల్లి నయనతార పై చేసిన కామెంట్స్.. నయనతార అత్త తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు. నా కొడుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్.. నా కోడలు ఒక స్టార్ హీరోయిన్.. వీరిద్దరూ కష్టపడే వ్యక్తిత్వం కలవారు. నా కోడలు అయితే మంచి మనస్తత్వం కలిగిన మంచి మనిషి అంటూ చెప్పుకొచ్చింది.. ఆమె మంచితనం గురించి చెప్పాలి అంటే వాళ్ళింట్లో పని చేసే ఒక వ్యక్తి నాలుగు లక్షల అప్పుతో తీవ్రంగా బాధపడుతూ ఉంటే వాళ్ళ అప్పు తీర్చి కష్టాల నుండి ఆదుకుంది. అంతేకాకుండా నా కోడలు పదిమంది చేసే పని ఒక్కత్తే చేస్తుందని ఆకాశానికి ఎత్తింది.

ఆమె ఎవరిని ఎలా చూడాలి పెద్దవారిని ఏ విధంగా గౌరవించాలి అనే విషయాలు బాగా తెలుసు. తను చేసే వృత్తి పట్ల అపారమైన గౌరవం ఉంటుంది.వారు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు కూడా ఎదుగుతారు అంటూ తన కోడల్ని ఆకాశానికి ఎత్తింది అని చెప్పవచ్చు. నయనతార విజ్ఞేశ్ శివన్ దంపతుల గురించి చెప్పాలంటే వీరిద్దరూ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నారు. తమ పిల్లల్ని చూసుకుంటూ వారి జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.. నయనతార చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో ప్రాజెక్టులు చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ విధంగా వీరి జీవితం కలకాలం బాగుండాలని మనందరం కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *