నాగచైతన్య .. సమంత ఇద్దరూ ప్రేమించుకొని ఒకరికొకరు ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నారు. అయితే గత ఏడాది విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదిలా ఉండగా తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద.. ఈ సినిమా విడుదలయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు నాగచైతన్య థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ తర్వాత లాల్ సింగ్ చద్దా సినిమాతో బాలీవుడ్ కి కూడా పరిచయం అయ్యాడు. ప్రస్తుతం నాగచైతన్య సినిమాలు , వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇదిలా ఉండగా వీరిద్దరూ విడాకులు తీసుకొని ఏడాది గడుస్తున్నప్పటికీ.. ఇంకా ఈ జంటకు సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

Samantha & Naga Chaitanya Funny Interview | Exclusive | Flash Back | TFPC - YouTube

ఈ క్రమంలోనే సమంత నాగచైతన్య పై గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ లో నటుడు రాహుల్ రవీంద్రన్ తో సమంత, నాగచైతన్య పాల్గొన్నారు. రాహుల్ రవీంద్రన్.. నాగచైతన్య ని ప్రశ్నిస్తూ.. నువ్వు సమంతకు ఎప్పుడు ప్రపోజ్ చేశావని? అడగడానికి.. చైతూ ఊహించని సమాధానం చెప్పాడు. ” దాదాపుగా పదేళ్ల ముందు మేమిద్దరం ఏ మాయ చేసావే సినిమా షూటింగ్లో కలుసుకున్నాము. ఆ తర్వాత సమంతను ఇంప్రెస్ చేయడానికి నాకు ఏడేళ్ల సమయం పట్టింది . అప్పటినుంచి సమంత ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను” అంటూ ఆసక్తికర కామెంట్లు చేశారు నాగచైతన్య.

ఇక చివరికి వేరే ఆప్షన్ లేక సమంతను పెళ్లి చేసుకున్నాను అని కూడా చెప్పాడు.. సమంతను సైతం రాహుల్ ఇదే ప్రశ్న అడగగా.. ఆమె సమాధానం ఇస్తూ “నాగచైతన్య ఏడేళ్లలో చాలామంది అమ్మాయిల వెంటపడ్డాడు.. ఏడేళ్ల తర్వాత నా టోకెన్ నంబర్ వచ్చింది” అంటూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవ్వడమే కాకుండా అంత ప్రేమ ఉన్నవారు ఎందుకు విడిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత మయో సిటీస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. మరొకవైపు నాగచైతన్య పై మరో డేటింగ్ రూమర్లు వైరల్ అవుతున్నాయి. కనీసం ఇప్పటికైనా అన్నింటికీ స్వస్తి పలికి వీరు కలుసుకుంటే బాగుంటుందని అభిమానులు ఆరాటపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *