సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు తెలియని సినీ ప్రియలు ఉండరు. ఇండియా వైడ్ గా స్టార్ ఇమేజ్ ఉన్న రజినీకాంత్.. తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో అవార్డుల‌ను, రివార్డులు సొంతం చేసుకున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అలాగే ఏడు పదుల వయసులోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అభిమానుల‌ను మరియు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

అటువంటి వ్యక్తిని ప్రముఖ నటి రాధిక బోరింగ్ మనిషి అంటూ షాకింగ్ కామెంట్స్‌ చేసింది. రీసెంట్ గా రాధిక ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా వేదికగా న‌టసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2 కు గెస్ట్ హాజరైన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురేష్ రెడ్డి లతో కలిసి రాధిక ఈ షోలో పాల్గొన్నారు.

బాలయ్య కిరణ్, సురేష్ రెడ్డిలు మంచి స్నేహితులు.. అందుకే ఈ ఎపిసోడ్‌‌కు వచ్చారు. కాస్త సినిమా ట‌చ్ ఇవ్వ‌డం కోసం రాధిక‌ను సైతం ఆహ్వానించారు. తాజాగా వీరికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న షోకు వ‌చ్చిన ఈ ముగ్గురు గెస్ట్ ల నుంచి బాలయ్య ఇంట్రెస్టింగ్‌ ఇన్ఫర్మేషన్ మొత్తం రాబట్టి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచారు.

ఈ క్రమంలోనే బాలయ్య ర‌జినీకాంత్ గురించి చెప్పమని కోరారు. అందుకు రాధిక రజనీకాంత్ బోరింగ్ మనిషి అంటూ ఓపెన్ గానే చెప్పేసింది. ఆయ‌న ఏదో ఒక మూలన కూర్చుని ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటారని రాధిక పేర్కొంది. కమల్ హాసన్ గురించి అడగగా.. అందుకు రాధిక ఆయనకు ప్రొఫెషన్ తప్ప మరో ఫోకస్ ఉండదని తెలిపింది. ఇక ఈ షోలో సరోగసి ప్రస్తావన కూడా వచ్చింది. న్యూ జనరేషన్ మైండ్ సెట్ మారిపోయిందని, కొందరు సరోగసిపై మనసు పడుతున్నారని రాధిక చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *