సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ప్రధాన అవయవాలు పనిచేయకపోవడం వల్లే స్వర్గస్తులైన కృష్ణ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలను సృష్టించారు. దాదాపుగా 350 కి పైగా చిత్రాలలో నటించి తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచిన కృష్ణ.. ఉన్నట్టుండి అనారోగ్య బారిన పడి మరణించడంతో మొదటి జనరేషన్ మొత్తం అంతమైపోయిందని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా మొదటిసారి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణం మీద ఆయన కొడుకు మహేష్ బాబు స్పందించడం జరిగింది . మహేష్ బాబు పెట్టిన ఈ పోస్టు చూసి అభిమానులు మరింత కంటతడి పెడుతున్నారు.

CGRvCVqUQAA2WgVమహేష్ బాబు తన పోస్ట్ ద్వారా.. ” మీ జీవితం ఎప్పుడూ పండుగలానే సాగింది. మీ అంతిమయాత్ర కూడా అలానే సాగింది. అదే మీ గొప్పదనం. ఏ భయం బెనుకూ లేకుండా బతికేశారు. డేరింగ్ డాషింగ్ అనేది మీ వ్యక్తిత్వం. మీరే నాకు స్ఫూర్తి. మీరే నా ధైర్యం. అదే మీ నుంచి నేను నేర్చుకున్నాను. మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు నాలో ఉన్న ఈ ధైర్యం, బలం ఇదివరకు ఎన్నడూ నేను అనుభవించలేదు. మీ కాంతి, మీ శక్తి ఎప్పుడూ నాలోనే ఉంటుందని.. ఇప్పుడు నేను ఏ భయం , బెనుకు లేకుండా చెప్పగలను. మీ వారసత్వాన్ని , మీ గౌరవాన్ని, మీ పరువు ప్రతిష్టలను నేను ముందుకు తీసుకెళ్తాను నాన్నా.. మీరు గర్వపడేలా చేస్తాను నాన్నా.. లవ్ యు నాన్నా.. మీరే నా సూపర్ స్టార్” అంటూ గుండెలు మెలిపెట్టేసాడు మహేష్ బాబు.

మహేష్ బాబు తన తండ్రి మరణించిన సమయంలో ఎంత ఎమోషనల్ అయ్యాడో.. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా మహేష్ బాబుకు తన అన్న రమేష్ బాబు, తల్లి ఇందిరా దేవి, తండ్రి కృష్ణ అన్నా కూడా ఎనలేని అభిమానం. వీరి ముగ్గురు అంటే మహేష్ బాబుకు మహా ప్రాణం. అలాంటిది వీరు ముగ్గురు ఒకే ఏడాదిలో చనిపోవడంతో ఆ బాధ నుంచి తేలుకోలేక మరింత సతమతమయ్యారు. మహేష్ బాబును చూసిన ప్రతి ఒక్కరు కూడా మరింత కంటతడి పెట్టుకున్నారు.

అయితే ఇప్పుడు ఇన్ని జరిగినా సరే ఆయన తన ధైర్యాన్ని మాత్రం విడనాడడం లేదు. తన తండ్రి తనలోనే ఉన్నాడు అంటూ మహేష్ బాబు చేసిన ఈ పోస్టు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది.

https://www.instagram.com/p/ClVqsAVPYzH/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *