నటీనటులు : ప్రదీప్ రంగనాథన్,సత్యరాజ్, ఇవానా,రాధిక శరత్ కుమార్, యోగిబాబు తదితరులు..
ఎడిటర్: ప్రదీప్ ఈ రాఘవ్
సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమ్
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాత : కల్పాతి ఎస్. అఘోరం,కల్పాతి ఎస్.గణేష్,కల్పాతి ఎస్.సురేష్
దర్శకత్వం: ప్రదీప్ రంగనాథన్
విడుదల తేది : 25/11/2022

కోమలి సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు డాకించుకున్న ప్రదీప్ రంగనాథం తొలిసారి హీరో గా నటిస్తున్న చిత్రం లవ్ టుడే. ట్రైలర్ తో ప్రేక్షకులను ఎంతో ఆసక్తి పరిచిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈరోజుల్లో, బస్సు స్టాప్ వంటి సినిమాల తరహా లోనే ఈ సినిమా యొక్క కంటెంట్ కూడా ఉందని ఈ సినిమా పట్ల యూత్ ఎంతో ఇంట్రెస్ట్ చూపించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ

ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నిఖిత, (ఇవానా) ఇద్దరు కూడా మంచి ప్రేమికులు. ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేనంత గా వీరు ప్రేమించుకుంటారు. అయితే వీరి ప్రేమ కొనసాగుతున్న క్రమంలో నిఖిత తండ్రి (సత్య రాజ్) కి ఈ విషయం తెలుస్తుంది. అయితే వీరి ప్రేమను ఒప్పుకోవాలంటే అయన ఓ షరతు విధిస్తాడు. ఇద్దరు కొన్ని రోజుల పాటు ఒకరి ఫోన్స్ ఒకరు మార్చుకోవాలని చెప్పాడు. అలా తండ్రి చెప్పిన ప్రకారం ఫోన్స్ మార్చుకున్న ప్రదీప్, నిఖిత లకు ఒకరి గురించి ఒకరికి ఎలాంటి నిజాలు తెలిసాయి. ఆ తర్వాత వారికి ఎదురైనా పరిణామాలు ఏంటి అనేదే ఈ సినిమా

నటీనటులు

హీరోగా నటించిన ప్రదీప్ రంగనాథన్ గురించే మొదట మాట్లాడుకోవాలి. ఉత్తమన్ ప్రదీప్ పాత్ర కు అయన బాగా సూట్ అయ్యాడు. మిడిల్ క్లాస్ వ్యక్తిగా, యువకుడిగా అయన ప్రేక్షకులను ఎంతో అలరించే నటన తో అలరించాడు. కొన్ని కొన్ని ఎక్స్ ప్రెషన్స్ తో అయన ఎంతో ఎంతో కామెడీ పండించాడు. హీరోయిన్ గా నటించిన ఇవాకా మంచి ప్రదర్శన కనపరిచింది. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా లో మరి హైలైట్ పాత్ర అయిన సత్యరాజ్ తన అనుభవానికి తగ్గట్లుగా నటించారు. యోగిబాబు కామెడీ ఆకట్టుకుంది. మిగితా పాత్ర దారులు తమ పాత్ర ల మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణులు

ఈ సినిమా లో హీరో గా నటించిన ప్రదీప్ రంగ నాథన్ దర్శకుడుగా వ్యవహరించడం ప్లస్ అయ్యింది. దర్శకుడుగా కెరీర్ మొదలుపెట్టడం కథ కథనాలపై గ్రిప్ ఉండడం ఎంతో కలిసి వచ్చింది. యూత్ ను ఆకర్షించే సబ్జెక్టు కావడంతో ఈ సినిమా కి ఇంత మైలేజ్ వచ్చింది. ఆద్యంతం అందరిని అలరించిన ఈ సినిమా కథనం పట్ల కూడా మంచి కేర్ తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో అమ్మాయిలూ, అబ్బాయి లు ఎలా ఉంటున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్నీ ఎంతో బాగా చూపించాడు. టెక్నికల్ గా కూడా సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అన్ని విభాగాలలో పనిచేసే అందరు మంచి ప్రతిభ కనపరిచారు. పాటల విషయం లో ఇంకాస్త శ్రద్ధ వహిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

ప్లస్ పాయింట్స్..

కథ. కథనం

హీరో ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్, రాధికల నటన

యోగిబాబు కామెడీ

మైనస్ పాయింట్స్

అక్కడక్కడ బోర్ కొట్టించే రొటీన్ సీన్స్

ఎడిటింగ్

సెకండాఫ్

ఫైనల్ గా ఈ సినిమా యూత్ కి మంచి కిక్ ఇస్తుంది. అక్కడక్కడా ఈరోజుల్లో, బస్టాప్ ఛాయలు కనిపిస్తాయి. ఈరోజుల్లో అమ్మాయిలూ, అబ్బాయిల మధ్య ప్రేమ ఎలా ఉంటుందో అన్న విషయాన్నీ ఎంతో క్లియర్ గా చూపించారు. అలాగే చివర్లో ఒక చక్కటి మెసేజ్ ను కూడా పొందుపరిచారు.

రేటింగ్ : 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *