రష్మిక మందన్న అంటే తెలియని వారు ఉండరు. ఆమె పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. అయితే అలాంటి రష్మిక ని ఓ ఇండస్ట్రీ బ్యాన్ చేయాలని భావిస్తుందట. మరి ఆ ఇండస్ట్రీ ఏంటి?అలా ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. రష్మిక కర్ణాటకకు చెందిన అమ్మాయి అని మాకు తెలిసిందే.అయితే ఈమె చేసిన కొన్ని తప్పుల వల్ల కన్నడ ఇండస్ట్రీ ఈమెను బ్యాన్ చేయాలనుకుంటుందట. అలాగే కర్ణాటకలో పుట్టి సొంత గడ్డ నే అవమానించినట్లు మాట్లాడడం కర్ణాటక ప్రజలకు ఏమాత్రం నచ్చడం లేదు.

అంతేకాదు ఈమెపై చాలామంది కన్నడ వాళ్ళు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే గతంలో మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న రష్మిక మందన్న నేను దక్షిణాది భాషల్లో ఉన్న మిగతా భాషలు మాట్లాడేటప్పుడు ఎలా ఇబ్బంది పడతానో కన్నడ మాట్లాడడానికి కూడా అలాగే ఇబ్బంది పడతాను అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.ఇక ఈ విషయంలో కన్నడ ప్రజలు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే మాతృభాష సరిగా మాట్లాడరాదని చెప్పి మా మాతృభాషను అవమానించింది అంటూ ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

అలాగే ఈ మధ్య కాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన కాంతారా సినిమా గురించి కూడా ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇక కాంతారా సినిమా కన్నడ సినిమా. ఈ సినిమా విషయంలో రష్మికను ఓ ఇంటర్వ్యూలో మీరు ఈ సినిమా చూశారా? ఆ సినిమా అంతగా సక్సెస్ అయింది కదా దానిమీద మీ అభిప్రాయం ఏంటి?అని అడగగా.. అసలు నేను ఇంతవరకు కాంతారా సినిమా చూడనే చూడలేదు అని ఓ షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో ఈ విషయంలో ఆమె కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక ఈ విషయాలన్నీ కన్నడ ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఆమెపై చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఈమెను ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేయాలని కన్నడ ఇండస్ట్రీ, థియేటర్ ఓనర్స్,ఆర్గనైజర్ అందరూ కలిసి ఆలోచిస్తున్నారట. అంతేకాదు త్వరలోనే కన్నడ ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేస్తున్నట్లు అధికార ప్రకటన కూడా రానుందని కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇదే గనక నిజమైతే రష్మిక కెరియర్ చిక్కులో పడ్డట్టే. అంతేకాదు ఈమె నటించే సినిమాల వల్ల నిర్మాతలకు కూడా పెద్ద దెబ్బే పడుతుంది. దీంతో ఈమెని హీరోయిన్గా పెట్టుకున్న సినిమా వాళ్ళు ఒక్కసారి గా అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఈమెను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే మా గతి ఏంటి?అంటూ భయపడుతున్నారు. అయితే ఈ విషయంలో త్వరలోనే క్లారిటీ రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *