నటీనటులు : అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్ , సంపత్ రాజ్, ప్రవీణ్ తదితరులు
దర్శకుడు : ఏఆర్ మోహన్
నిర్మాత: రాజేష్ దండా
సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకల
సినిమాటోగ్రఫీ: రామ్ రెడ్డి
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

నాంది సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన అల్లరి నరేష్ ఇప్పుడు నటించిన తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఇప్పటికే వచ్చిన అప్డేట్ లతో అందరిని ఆకర్షించిన ఈ హీరో సినిమా పై మంచి అంచనాలను పెంచాడు. అలా ఇప్పుడు ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల చేశాడు. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ఏవిధంగా ప్రేక్షకులను అలరించిందో ఇప్పుడు ఈ సమీక్ష లో చూద్దాం.

కథ :

స్కూల్ టీచర్ గా పని చేస్తున్న శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఎలక్షన్ కోసం మారేడుమిల్లి లోని ఓ ట్రైబల్ విలేజ్ కి వెళతాడు.అయితే అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని వారి కష్టాలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికే ప్రజల తీరుతో విసిగిపోయిన ప్రజలు శ్రీనివాస్ కి సహకరిస్తారు.ఈ పనులలో శ్రీనివాస్ కి లక్ష్మి (ఆనంది) సహకరిస్తుంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయా నాయకుల నుంచి ప్రజల కొచ్చిన కష్టం ఏంటి. ఆ కష్టానికి ఎదురుగా నిలబడి శ్రీనివాస్ ఎలా అక్కడి ప్రజల హక్కులను కాపాడాడు అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు :

నరేష్ ఎప్పటిలాగానే చాలా బాగా నటించాడు. రెండో ఇన్నింగ్స్ లో సీరియస్ పాత్ర ను ఎంచుకుని దూసుకెళ్తున్న నరేష్ కి ఇది సూట్ అయ్యే పాత్ర. తన సెటిల్డ్ నటనతో మరోసారి ఈ పాత్ర ద్వారా అలరించాడు. ఇక లక్ష్మి పాత్ర లో ఆనంది చాలా బాగా నటించింది. తన గ్లామర్ తో పాటు, తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. కలెక్టర్ గా సంపత్ రాజ్ మంచి నటన కనపరిచాడు. ఇంగ్లీష్ టీచర్ గా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నారు.మిగితా పాత్ర దారులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక నిపుణులు :

దర్శకుడు ఏఆర్ మోహన్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. ఈమధ్య కాలంలో ఇలాంటి కథ రాలేదనే చెప్పాలి. గిరిజనల జీవితాల్లోని సమస్యలను చూపించే ప్రయత్నం చేశారు. వారి జీవిత గాధలను ఎంతో రియలిస్టిక్ గా చూపించారు. అక్కడక్కడా సాగతీత సీన్స్ తప్పా ఈ సినిమా కు మంచి దర్శకత్వం అందించారు. ఇక సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.శ్రీ చరణ్ పాకాల అన్ని విభాగాల్లో ఆకట్టుకున్నాడు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

తీర్పు :

ఎమోషనల్ డ్రామా అయినా ఈ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పర్వాలేదు. నాంది సినిమా స్థాయి లో ఈ సినిమా ను ఎక్స్ పెక్ట్ చేస్తే నిరాశపడతారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకోదు. అల్లరినరేష్ కామెడీ ని ఎంజాయ్ చేసేవారికి నిరాశను కలిగిస్తుంది.

రేటింగ్ : 2.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *