ప్రముఖ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న పవిత్రలోకేష్ .. గత కొన్ని నెలలుగా సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరో నరేష్ తో సహజీవనం చేస్తోంది అనే వార్తలు గత కొద్ది రోజుల నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా తమ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వీరు ఇప్పుడు పబ్లిక్ గా అందరికీ తెలిసేలా చట్టపట్టలేసుకొని తిరుగుతూ ఉండడం గమనార్హం. వీళ్ళకి సంబంధించిన డేటింగ్ మేటర్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రోలింగ్ అవుతూనే ఉంటుంది. అయినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పవిత్ర లోకేష్ మాత్రమే తనకు ఇంపార్టెంట్ అంటూ ఆమెను నెత్తిన పెట్టుకొని తిరిగేస్తున్నాడు నరేష్.

అంతేకాదు విజయనిర్మల మరణం తర్వాత కృష్ణ, నరేష్ ఒకే ఇంటిలోనే ఉండేవారు. వీరితో పాటు పవిత్ర లోకేష్ కూడా అక్కడే ఉందని.. కృష్ణ అంగీకారంతోనే వీరిద్దరూ సహజీవనం చేస్తున్నామని కూడా వెల్లడించారు. అదంతా ఇలా ఉండగా ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కూడా మరణించడంతో ఆ బాధ ఆయనకు ఏమీ లేకుండా అక్కడ కూడా పవిత్ర లోకేష్ కి ఇంపార్టెంట్ ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా ఆమె భుజంపై ఆయన చేతులు వేసుకొని మళ్ళీ వెళ్లడం అందర్నీ మరింత ఇబ్బంది పెట్టేసింది.

కృష్ణ మరణించిన తర్వాత ఆయన పార్థివ దేహం అక్కడ ఉంటే నరేష్ మాత్రం పవిత్ర లోకేష్ పై చేయి వేసి ఇంటి లోపలికి తీసుకురావడం అసలు ఏం బాగలేదని ప్రతి ఒక్కరు చెబుతున్నారు . అంతే కాదు ఈ విషయంపై కృష్ణ ఫ్యామిలీ సభ్యులు కూడా మండిపడినట్లు సమాచారం. పవిత్ర లోకేష్ తండ్రి లాంటి వ్యక్తి చనిపోయి అక్కడ ఉంటే.. ఆయన పార్థివ దేహం చూడడానికి వచ్చిన పెద్ద మనుషులను నవ్వుతూ పలకరించడం చాలా షాకింగ్ గా అనిపించిందని ఘట్టమనేని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

అసలు విషయంలోకెళితే .. మహేష్ బాబును పరామర్శించడానికి వచ్చిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ని, ఒక ప్రొడ్యూసర్ని నరేష్ చులకనగా చేసి మాట్లాడాడని ఒక వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో.. పవిత్ర లోకేష్ తనకు ఘట్టమనేని ఇంటికి కోడలు స్థానం కల్పించాలని కొత్త డిమాండ్ పెట్టిందట. మన రిలేషన్ ని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీకి మహేష్ బాబు భార్యగా నమ్రత ఎలాంటి అధికారాలు దక్కించుకుందో నరేష్ భార్యగా నేను కూడా అలాంటి అధికారాలు దక్కించుకోవాలనుకుంటున్నాను అంటూ కొత్త డిమాండ్ పెట్టిందట.. అంతేకాదు మహేష్ బాబుకు నువ్వు ఏమాత్రం తీసిపోవు.. ఇంట్లో పూర్తి అధికారాలు నీకు మహేష్ కు సగం సగం ఉండాలని కొత్త ప్రపోజల్ పెట్టిందట. అయితే కృష్ణ మరణించిన తర్వాత ఈమె తన నిజ స్వరూపం బయట పెట్టింది అంటూ ప్రతి ఒక్కరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *