విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి గొప్ప నటుడు నిన్న అస్వస్థత కారణంగా హాస్పిటల్లో చేరారు అంటూ ఓ వార్త బయటికి వచ్చింది. అయితే ఆయనకి కొంచెం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించి చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్లో చేర్పించారట. జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో కొంచెం ఇబ్బంది తలెత్తడంతో ఆయన తొందరగా హాస్పిటల్ కి వెళ్ళినట్లు సమాచారం.

ఇక విశ్వనటుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ దాదాపు 5 దశాబ్దాల నుండి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక అలాంటి హీరో అస్వస్థత తో హాస్పిటల్ లో చేరారు అనే వార్త బయటికి రాగానే చాలామంది ఆయన అభిమానులు అయోమయంలో పడ్డారు. ఏమైంది మా హీరోకి… ఎందుకిలా సడన్గా హాస్పిటల్ లో చేరారు.ఆయనకు ఎలాంటి హాని జరగకుండా త్వరగా హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి రావాలి అంటూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఆయన హెల్త్ గురించి డాక్టర్లు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.

డాక్టర్లు మాట్లాడుతూ.. ఆయనకు జ్వరం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తి హాస్పిటల్ కి వచ్చారు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నాము. ఇంకో రెండు మూడు రోజుల్లో ఆయన ను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తాము. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. మీరు ఎలాంటి భయాందోళనలు పడవద్దు అంటూ డాక్టర్లు కమలహాసన్ హెల్త్ పై ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇక కమల్ హాసన్ ఈ సంవత్సరం విక్రమ్ సినిమాతో ఎంత అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారో మనకు తెలిసిందే.

యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో వచ్చి కమల్ హాసన్ సినీ కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక త్వరలోనే కమలహాసన్ భారతీయుడు 2 సినిమాని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇంతలోనే కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరడం చాలా బాధాకరం. ఇక ఆయన హాస్పిటల్ నుండి త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆ దేవున్ని ప్రార్థిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *