తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విలన్ గా..విభిన్నమైనా పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు జగపతిబాబు. ఈయన మొదట్లో నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆయన ఓ స్టార్ హీరోయిన్ చనిపోయినప్పుడు ఆయన కూడా చనిపోవాలనుకున్నారట. మరి ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

విషయంలోకి వెళ్తే.. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి గ్లామర్స్ పాత్రల్లో నటించకుండా,ఎక్స్పోజింగ్ చేయకుండా స్టార్ హీరోయిన్గా వెలిగిన సౌందర్య అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈమె దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించి  స్టార్ హీరోయిన్గా ఎంతో మంది అభిమాలను సంపాదించుకుంది. అయితే సౌందర్య జగపతి బాబు కలిసి చేసిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.అయితే వీరి మధ్య ఉన్న బంధం గురించి ప్రముఖ జర్నలిస్టు ఇమంది రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇమంది రామారావు మాట్లాడుతూ.. అసలు జగపతిబాబు ఇంత పెద్ద ఆర్టిస్టు అవుతారని మేము ఎప్పుడు అనుకోలేదు.

అయితే హీరో అంటే ఎలాగో అలా నటించొచ్చు.కానీ విలన్ గా చేయాలంటే ఎన్నో ఎక్స్ప్రెషన్స్ పండించాలి.ఇలా కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా తన పర్ఫామెన్స్ ఏంటో చూపించాడు.ఇక జగపతిబాబు హీరో కన్నా ఎక్కువ విలన్ గానే మంచి గుర్తింపు వచ్చింది. అలాగే జగపతిబాబు ఎప్పుడు కూడా నిర్మాతల మీద ఎటువంటి భారం పడకుండా షూటింగ్ టైంలో తన ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఆయనే మన సొంత డబ్బులతో అన్నీ దగ్గరుండి చూసుకునేవారు. ఇక జగపతిబాబు సౌందర్య ఇద్దరు మంచి స్నేహితులు. ఒకానొక టైం లో సౌందర్య చనిపోయాక జగపతిబాబు చాలా బాధపడుతూ నేను కూడా చనిపోవాలనుకుంటున్నాను అంటూ చాలా ఎమోషనల్ గా చెప్పారు.

అంత గొప్ప ఫ్రెండ్ చనిపోయాక నేను ఇంకా బతకడం ఎందుకు అంటూ. జగతిబాబు చెప్పుకొచ్చారు. అలాగే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల అప్పుల పాలై చివరికి ఇల్లు కూడా అమ్ముకున్నారు జగపతి బాబు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకు విలన్ గా ఆఫర్లు ఎక్కువగా రావడం వల్ల మళ్లీ మంచి పొజిషన్లోకి వచ్చారు. ఇక ఈ విషయంలో జగపతిబాబు కు ఉన్న మంచి వ్యక్తిత్వమే ఆయన మళ్ళీ మంచి పొజిషన్ కి వచ్చేలా చేసింది. ప్రస్తుతం జగపతిబాబు  చేతినిండా ఆఫర్లతో సినీ కెరియర్ లో బిజీగా ఉన్నారు అంటూ ఓ ఇంటర్వ్యూలో ఇమంది రామారావు జగపతిబాబు గురించి చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *