సిరి శ్రీహాన్ బిగ్ బాస్ కి రాకముందే సోషల్ మీడియా ద్వారా చాలామందికి వీళ్ళిద్దరూ తెలుసు. ఇక కొన్ని వెబ్ సిరీస్ లో నటించి వీళ్లిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సిరి గత బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లింది. ఇక ఈ సీజన్ లో సిరి ప్రియుడు శ్రీహాన్ హౌస్ లోకి వెళ్లి ఎలా ఆడుతున్నాడో మనకు తెలిసిందే.అయితే ఆయన ఆటతీరుతో, కామెడీతో అందరినీ నవ్విస్తూ ఉన్నాడు.ఇక ఫ్యామిలీ వీక్ లో భాగంగా సిరి శ్రీహాన్ కోసం హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది.

అలాగే సిరి వచ్చాక కొద్దిసేపటికే వాళ్ళు పెంచుకుంటున్న బాబు కూడా లోపలికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. శ్రీహాన్ ని డాడీ సిరి ని మమ్మీ అని పిలవడంతో పెళ్లి కాకుండా వీళ్ళకు బాబు ఎలా వచ్చాడు అంటూ అందరూ షాక్ అయ్యారు. అలాగే ఆ చిన్న పిల్లాడు హౌస్ లోని కంటెస్టెంట్లందర్నీ ఇమిటేట్ చేస్తూ అందరిని అలరించాడు. అయితే ఆ పిల్లాడు ఎవరు అనే విషయంపై చాలామంది రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఆ పిల్లాడు తల్లిదండ్రులు పేదరికంలో ఉంటే వీళ్లిద్దరూ ఆ బాబుని దత్తత తీసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఆ బాబు అనాధ కాదట. సిరి శ్రీహన్ ఇద్దరూ దత్తత తీసుకున్న ఆ బుడ్డోడి పేరు చైతు. అయితే ఈ బాబు ఎవరో కాదు స్వయానా సిరి మేనమామ కొడకట. ఇక ఈ విషయాన్ని సిరి తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సిరి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ ఉన్నప్పుడు ఆమె తల్లి ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

బయటికి వచ్చాక ఆమె తల్లి శ్రీదేవి ఎన్నో చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. అయితే ఆ ఛానల్ వారు అసలు సిరి పెంచుకుంటున్న చైతు ఎవరి కొడుకు అని అడగ్గా వాడు ఎవరో కాదు స్వయానా మా తమ్ముని కొడుకే అంటూ సిరి తల్లి శ్రీదేవి అప్పట్లో ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. అయితే సిరి శ్రీహాన్ లు పెళ్లి చేసుకోక పోయినప్పటికీ ఒకే ఇంట్లో ఉంటారు. అలాగే ఈ బాబు చైతు కూడా వాళ్ళ దగ్గరే చాలా రోజుల నుండి ఉంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *