బిగ్ బాస్ సీజన్ 6 లో ఈ వారం ఫ్యామిలీ వీక్ మొదలైంది. చాలామంది కంటెస్టెంట్లకు సంబంధించి ఇప్పటికే వాళ్ల కుటుంబ సభ్యులు వచ్చారు. అలాగే కంటెస్టెంట్ ల ఎమోషన్ల వల్ల ఈవారం బిగ్ బాస్ కి రేటింగ్ బాగానే వస్తుంది. అలాగే బిగ్ బాస్ ఈవారం ఇంటి సభ్యులకు బిగ్బాస్ ట్రైనింగ్ సెంటర్ అనే ఒక టాస్క్ ఇచ్చారు. ఇందులో చాలామంది ఇంటి సభ్యులు నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారు. ఫైమా ఇంగ్లీష్ టీచర్ గా, రేవంత్ యోగా టీచర్ గా, శ్రీహన్ ఫ్లటింగ్ ట్రైనర్ గా ఉండి ఇప్పటికే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు.

ఇక శ్రీహన్ కి వచ్చిన ఫ్లటింగ్ ట్రైనర్ అనే టాస్క్ లో రాజశేఖర్ ని పిలిచి అమ్మాయిలను ఎలా పడేయాలి అనే విషయంలో రాజశేఖర్ కి కొన్ని విషయాలు చెప్పారు. ఇంటి సభ్యులందరూ రాజశేఖర్ ని ఫ్లట్ చేయాలని అనుకోవడంతో ఇనాయ రాజశేఖర్ ని శ్రీహాన్ పిలిచాడు. అలాగే ఆదిరెడ్డికి కూడా అమ్మాయిల్ని ఎలా పడేయాలో చేసి చూపియ్యమన్నాడు. దానికి ఆదిరెడ్డి నేను ఫైమాను పొగుడుతా అంటూ లేచారు. ఇక ఈ నేపద్యంలోనే ఆదిరెడ్డి ఫైమా ని పొగిడే పనిలో పడ్డారు. నువ్వు కింద పడ్డప్పుడు నీకేమైనా దెబ్బలు తగిలాయా అంటూ ఫైమాను అడిగాడు ఆదిరెడ్డి.

ఎందుకు అని ఫైమా అడగ్గా.. స్వర్గం నుండి కింద పడితే దెబ్బలు తగిలాయేమో అనుకుంటున్నాను అంటూ చాలా ఫన్నీగా ఆది రెడ్డి చెప్పుకొచ్చారు. దీనికి ఫైమా ఛీ పోరా అంటూ పరిగెత్తుకు వెళ్ళింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి మరొక వ్యక్తి వచ్చాడు . ఏవండోయ్ భాను గారు అంటూ కీర్తిని పిలుచుకుంటూ ఆమె లవర్ లోపలికి వచ్చాడు. ఇక ఆయన రాకతో కీర్తి ఆనందానికి అవధులు లేవు. అలాగే కీర్తి లవర్ నటుడు భాను కంటెస్టెంట్లందరి గురించి చెప్పాడు. ఇక ఇనయా విషయంలో మీరు కిస్ ఎక్కడి ఇస్తారు అంటూ అందరి ముందు అడగడంతో ఒక్కసారి గా అందరూ ఆశ్చర్యపోయారు.

అలాగే ఆయన వెళ్లిపోయేటప్పుడు కీర్తి పిల్లలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలను ఇవ్వడంతో కీర్తి చాలా ఎమోషనల్ అయింది. అలాగే కీర్తికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి అతను బిగ్ బాస్ నుండి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇనయా తల్లి బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతోనే ఇనయా చాలా ఏడ్చేసింది.ఎందుకంటే ఆమె సినిమా ఇండస్ట్రీ కోసం ఇంట్లో వాళ్ళందరినీ వదిలి వచ్చేసింది. అప్పటినుండి ఇనయాకు వాళ్ళ తల్లిదండ్రులతో మాటలు లేవు. అయితే హౌస్ లోకి ఇనయా తల్లి రావడంతో ఆమె చాలా కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళ మీద పడింది. మొత్తానికి ఈ వారం అందరూ ఎమోషనల్స్,ఎంటైన్మెంట్ అందరినీ అట్రాక్ట్ చేసింది. అయితే ఈ ఫ్యామిలీ వీక్ తో ఈ షో రేటింగ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *