కూచిపూడి డాన్సర్ గా దక్షిణాది పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న భానుప్రియ.. ఇండస్ట్రీలోకి వచ్చి అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈమె టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి, వదిన లాంటి క్యారెక్టర్ పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈమె చెల్లెలు నిశాంతి అలియాస్ శాంతిప్రియ కూడా హీరోయిన్గా చేసిందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

Actress banupriya sister shanthipriya | பானுபிரியா தங்கை

కొన్ని సినిమాలలో నటించినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్న శాంతి ప్రియ మహర్షి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సింహ స్వప్నం, యమపాశం, నాకు పెళ్ళాం కావాలి , రక్త కన్నీరు, అగ్ని, శిలాశాసనం , జస్టిస్ రుద్రమదేవి వంటి తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా నటించి మెప్పించింది శాంతి ప్రియా. అయితే సినిమాలలో బిజీగా ఉన్నప్పుడే వివాహం చేసుకొని వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన ఈమె ఆ తరువాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. మధ్యలో కొన్నాళ్లు సీరియల్స్ లో నటించినా కూడా వెండితెరపై మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.

అలా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఇటీవల ఈమె “ధారావి బ్యాంక్ ” అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇందులో సునీల్ శెట్టి , వివేక్ ఓబెరాయ్ వంటి ప్రముఖులు కూడా నటించారు.. ఈ సిరీస్ లో సునీల్ శెట్టి చెల్లెలు పొన్నమ్మ పాత్రలో కనిపించి అందరిని మరొకసారి ఆకట్టుకుంది శాంతి ప్రియ. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇదిలా ఉండగా 1999లో ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ రే తో ఏడడుగులు వేసిన శాంతి ప్రియ ఆ తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనించింది. అయితే 2004లో శాంతి ప్రియ భర్త కన్నుమూయడం ఆమె జీవితానికి తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *