నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్‌ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నారు.

ఇలా ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతూనే మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు అలాగే ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా ప్రసారమవుతున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బాలయ్య తొలిసారి హోస్ట్ గా చేస్తున్న టాక్ షో ఇది. ఆల్రెడీ సీజన్ 1 కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం కాదు ఎన్నో రికార్డులను సైతం నెలకొల్పింది. దీంతో రీసెంట్ గా సీజన్ 2 సైతం ప్రారంభించారు.

బాలయ్య హోస్టింగ్ కు సొంత అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా బాల‌య్య‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ గా మారింది. అదేంటంటే.. బాలయ్య త్వ‌ర‌లోనే ఓ టీవీ షోలో సందడి చేసేందుకు సిద్ధం అవుతున్నారట. ఇంతకీ ఆ టీవీ షో మరేదో కాదు బిగ్ బాస్. ఈ బిగ్గెస్ట్ రియాల్టీ షో ఇప్పటికే ఐదు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.

ప్రస్తుతం 6వ సీజన్ కొనసాగుతోంది. నాగార్జున హోస్ట్ గా హరిస్తున్న ఈ షో ఆఖరి దశకు చేరుకుంది. త్వరలోనే ఫినాలే ఎపిసోడ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఫినాలే ఎపిసోడ్ కు ఎవరో ఒక స్టార్ హీరో వస్తుంటారు. విన్న‌ర్ ను ప్ర‌క‌టించి.. ట్రోఫీ అంద‌జేస్తుంటారు. అయితే ఈసారి చీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ రాబోతున్నారట. బిగ్ బాస్ షో నిర్వాహకులు బాలయ్యతో ఇప్ప‌టికే సంప్రదింపులు జ‌రిపార‌ని.. ఆయన వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని నెట్టింట‌ జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారమే నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయమని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *