ఈ మధ్యకాలంలో థియేటర్లో విడుదలవుతున్న సినిమాలు కంటెంట్ పరంగా బాగుంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. లేకపోతే ఆ సినిమా డిజాస్టర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా థియేటర్లలో సినిమాలు చూడడం అంటే అది భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తూ ఉండడంతో థియేటర్ల వైపు పెద్దగా ప్రేక్షకులు అడుగు వేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూనే ఉన్నాయి. అలా ఇప్పటివరకు ఆశ్చర్యానికి గురి చేసిన చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఏడాది విడుదలైన కే జి ఎఫ్-2, కాంతారా సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ అవుతూనే ఉన్నాయి. ఇక ఈ రెండు చిత్రాలు కన్నడ చిత్రాలు కావడం గమనార్హం. అన్ని వర్గాల ప్రేక్షకులను సైతం ఈ చిత్రాలు బాగానే ఆకట్టుకున్నాయి.. ఇక రాజమౌళి సినీ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బ్లాస్టర్ సినిమాగా నిలిచిన చిత్రం బాహుబలి-2. ఇక రాబోయే రోజుల్లో ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏది వస్తుందో చూడాలి. ఇక ఈ మూడు చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతోపాటు ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ సైతం బ్రేక్ చేయడం జరిగింది.

ఇతర జోన్లలో వేరువేరు రకాలుగా తెరకెక్కించిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పాల్సిన పనిలేదు. కథ కథనం కొత్తగా ఉంటే పరిమితి బడ్జెట్లో తెరకెక్కించిన ఈ సినిమాలలో సరిత ఎన్నో అద్భుతాలు చేస్తాయని ఈ చిత్రాలు నిరూపించాయి. కేవలం తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించిన చిత్రం కాంతారా రూ.16 కోట్లతో తెరకెక్కించగా ఇప్పుడు రూ.400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇందులో హీరోగా, డైరెక్టర్ గా రిషబ్ శెట్టి నటించారు. అయితే తన తదుపరి చిత్రం ఈ డైరెక్టర్ తో ఎవరు సినిమా చేస్తారని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి విజయాలను సొంతం చేసుకున్నాయని అభిమానులు కూడా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *