మహేష్ బాబు నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక వీరిద్దరి ప్రేమ అప్పట్లో ఓ సెన్సేషనల్. వీళ్ళిద్దరూ తీసిన వంశీ అనే సినిమాతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమ గా మారింది. ఇక చాలా రోజులు వీరి ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు వీరి ప్రేమ విషయం చెప్పాడు మహేష్ బాబు. కానీ వీరి ప్రేమను ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు.

కృష్ణ పెళ్లి వద్దే వద్దని మొండికేసి కూర్చున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం నమ్రతనే పెళ్లి చేసుకుంటానంటూ పట్టు వీడని విక్రమార్కుడిలా మొండి పట్టు పట్టారు. ఇక ఈ విషయంలో కృష్ణ గారే కాస్త వెనక్కి తగ్గి మహేష్ బాబు నమ్రతల పెళ్లికి పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. అయితే మహేష్ బాబు నమ్రతని పెళ్లి చేసుకుంటానంటే కృష్ణ మహేష్ బాబుని ఒకే ఒక్క మాట అడిగారంట.

అదేంటంటే.. మహేష్ ఆర్ యు షూర్.. నీకు నమ్రత ను పెళ్లి చేసుకోవడం ఓకే కదా అంటూ అడిగారట. దానికి మహేష్ బాబు నాకు నమ్రత అంటే ఇష్టమే నాన్న అంటూ చాలా స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చారట.ఇక దీంతో చేసేదేమీ లేక కృష్ణ మహేష్ బాబుకి నమ్రతని ఇచ్చి పెళ్లి చేయించారు. ఇక పెళ్లయ్యాక నమ్రత సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటి భాద్యతలను తన భుజాన వేసుకొని అలాగే భర్త సినిమా విషయాలు అన్నింటిని దగ్గరుండి చూసుకుంటుంది.

అలాగే నమ్రత ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. ఎందుకంటే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ మహేష్ బాబును పెళ్లి చేసుకున్నాక తన సినీ కెరీర్ని సైతం పక్కనపెట్టి కేవలం కుటుంబానికే ప్రాధాన్యత నిచ్చింది. ఇక ఈ విషయంలో కృష్ణ కూడా నమ్రతను మెచ్చుకుంటారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *