టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత గురించి అందరికీ సుపరిచితమే. ఇక ఈ మధ్యనే సమంత నటించిన పాన్ ఇండియా సినిమా యశోద సినిమా రిలీజయ్యి మొదటి రోజు నుండే మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే..తన మాజీ భర్త నాగచైతన్య బర్త్డే రోజే సమంతకి భారీ షాక్ తగిలింది.అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సమంత హీరోయిన్ గా వచ్చిన యశోద సినిమా పాన్ ఇండియా లెవల్లో తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది.

ఇక ఈ సినిమా వసూళ్ల పరంగా మంచి కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ కూడా పూర్తిచేసి మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. అయితే ఈ మధ్యన కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అవ్వడంతో అక్కడక్కడ కొన్ని కలెక్షన్లు తగ్గినా కూడా కొన్ని చోట్లలో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి.ఇక ఈ నేపద్యంలోనే యశోద సినిమాని ఓటీటి లో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ అంతా సవ్యంగానే సాగుతుంది అనుకునే టైంలో సిటీ సివిల్ కోర్టు యశోద సినిమాకి షాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కావడానికి ఒప్పుకోనే ఒప్పుకోమంటు నిర్మాతకు నోటీసులు పంపించింది.

ఈ సినిమాని ఓటీటి రిలీజ్ చేయవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కారణం.. యశోద సినిమా మీద ఆసుపత్రి యాజమాన్యం వేసిన పిటిషన్ మీద కోర్టు విచారణ జరిపి నిర్మాతకి సినిమాని ఓటీటిలో విడుదల చేయద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఈ సినిమాలో సమంత పాత్ర ఈవా హాస్పిటల్ పరువు ప్రతిష్టలు దెబ్బతినేలా ఉంటుందని తమ పిటిషన్ లో ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పుకొచ్చారు. అంతే కాదు యశోద సినిమా మా హాస్పిటల్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని వాళ్ళు తమ పిటిషన్ లో చెప్పుకొచ్చారు. అలాగే సినిమాలో చూపించిన సరోగసి సెంటర్ పేరు కూడా ఈవా సరోగసి సెంటర్ అని ఉండడంతో ఈవా హాస్పిటల్ వారి పేరు చెడిపోతుంది అనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్ యాజమాన్యం యశోద సినిమాపై కోర్టులో పిటిషన్ వేసింది.

ఇక ఈ విషయం మీద సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన శివలెంక కృష్ణ ప్రసాద్ కు నోటీసులు జారీ చేసింది కోర్టు. అయితే యశోద సినిమాని డిసెంబర్ 19న ఓటీటిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఓటిటిలో రిలీజ్ చేయడానికి వీలు లేదు అంటూ కోర్టు మూవీ యూనిట్ కి ఆదేశాలు జారిచేసింది. అయితే ఈ విషయంలో సరోగసి పద్ధతిపై సినిమా ఉంటుందని అందరూ భావించారు కానీ సినిమా మొత్తం చూస్తే గాని అర్థం కాదు. అయితే ప్రస్తుతం నాగచైతన్య బర్త్డే రోజే సమంతకు ఇలాంటి షాకింగ్ న్యూస్ ఎదురయింది అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *