ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా యశోద మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరి-హ‌రీష్ ద్వ‌యం దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మంచి విజయం సాధించింది. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కారణంగా యశోద ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయింది. అయినా సరే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

ప్రస్తుతం ఇంటికే పరిమితమైన సమంత మయోసైటిస్ వ్యాధితో పోరాడుతుంది. దాని నుంచి బయటపడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇకపోతే సమంత కోసం వంట కోట్ల పెట్టుబడులు మోక్షం పొందడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాయి. అందులో మొదటిది `శాకుంతలం`. గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కావ్యంను దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సైతం ఆఖ‌రి ద‌శ‌కు చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి ఈ మూవీకి రూ. 60 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాకు ఇప్పటివరకు ఎలాంటి బజ్‌ నెలకొనలేదు. సమంత రంగంలోకి దిగితే తప్ప ఈ సినిమాకు కావాల్సిన హైప్ ఏర్పడదు.

ఇక శివ నిర్మాణ దర్శకత్వంలో స‌మంత‌ `ఖుషి` అనే రొమాంటిక్ ల‌వ్ స్టోరీని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌ పై పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు అర‌వై శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని సైతం త్వ‌ర‌త్వ‌ర‌గా కంప్లీట్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇంతలోనే సమంత అనారోగ్యానికి గురైంది. ఈ మూవీకి రూ. 40 కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తానికి ఈ రెండు సినిమాలు సమంత ఎప్పుడెప్పుడు కోలుకుంటుందా అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. సమంత పూర్తిగా కోలుకుంటే గానీ.. ఈ సినిమాల‌ పెట్టుబడులకు మోక్షం లభించదు. మరి ఈ రెండు చిత్రాలకి ఎప్పటికి రూట్ క్లియర్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *