టాలీవుడ్ లో చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్న హీరో ఉదయ్ కిరణ్.. టాలీవుడ్లో తనదైన ముద్ర వేసుకున్నారు అయితే ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా పేరు పొందిన ఈ యువ హీరో అతి చిన్న వయసులోనే తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసిందే. 2014లో ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకొని బలవన్మరణం పొందడం అటు అభిమానులలో.. సినీ సెలబ్రిటీలకు సైతం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోవడానికి ఇండస్ట్రీలో కొంతమంది వ్యక్తులు కారణమని అప్పట్లో ఎక్కువగా చర్చలు వినిపించాయి. కానీ ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలపై ఇప్పటివరకు సరైన క్లారిటీ లేదని చెప్పవచ్చు.

ఈ నేపథ్యంలో ఉదయ్ కిరణ్ ని హీరోగా లాంచ్ చేసిన క్రియేటివ్ డైరెక్టర్ తేజ కూడా ఇటీవల ఉదయ్ కిరణ్ మరణం పైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ మరణానికి గల కారణాలు తనకి తెలుసు అని, కానీ అవి ఇప్పుడు బయట చెప్పలేనని తెలిపారు. ముఖ్యంగా అవునన్నా కాదన్న సినిమా షూటింగ్ సమయంలో తనతో మాట్లాడాడని చాలా విషయాలు షేర్ చేసుకున్నారని.. ఉదయ్ కిరణ్ జీవితంలో ఏం జరిగిందో అంత తనకు తెలుసు అని , అన్ని విషయాలు తనకు చెప్పారని కూడా తెలిపారు. అసలు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా నేను మరణించే లోపు ఈ విషయాలను తెలుపుతానని తేజ తెలిపారు.

Pawan Kalyan - Paritala Ravi: Pawan Kalyan stages Dharna at Deccan  Chronicle office

తాజాగా ఉదయ్ కిరణ్ మరణం పై సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ కూడా మాట్లాడుతూ.. ఉదయ్ కిరణ్ మరణానికి కారణాలపై తనకి పూర్తిగా అవగాహన లేదని ఒకవేళ డైరెక్టర్ తేజకు అన్ని విషయాలు తెలిసి ఉండవచ్చని గీతాకృష్ణ తెలిపారు. అతని జీవితానికి సంబంధించి అన్ని విషయాలు మీద తేజాకు అవగాహన ఖచ్చితంగా ఉంటుంది.. ఒకవేళ అలాంటి నిజాలు వెనక ఒక సినిమా తెరకెక్కిస్తే అతనికి ప్లస్ అవుతుందని గీతాకృష్ణ తెలిపారు. ఉదయ్ కిరణ్ అప్పట్లో చిరంజీవి కూతురుతో తిరిగే వారని.. పెళ్లి చేయాలని నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఒకసారి రోడ్డు మీద ఏదో బంద్ చేస్తున్నప్పుడు డెక్కన్ క్రానికల్ వారితో గొడవ జరగడం జరిగింది. అయితే ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ని బ్యాడ్ చేయడం కోసం.. ఉదయ్ కిరణ్ కు ఆల్రెడీ వివాహమైనట్టు ఫోటోలతో సహా బయట పెడతామని బెదిరించారట.

Director Intrudes In PK Life | cinejosh.com

అప్పటివరకు ఉదయ్ కిరణ్, సుస్మిత ప్రేమించుకుంటున్నారు అనే విషయం చిరంజీవి ఫ్యామిలీకి తెలియదు.. డెక్కన్ క్రానికల్ వాళ్లు ఈ అసలు విషయాన్నీ బయట పెట్టడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలిపారు. అంతేకాకుండా డెక్కన్ వాళ్లు బ్లాక్ మెయిల్ కింద ఈ విషయాన్ని వాడుకోవాలనుకున్నారు.. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ వెళ్లి ఉదయ్ కిరణ్ మీద మ్యాన్ హ్యాండిలింగ్ చేసినట్లు విన్నానని తెలిపారు గీతాకృష్ణ. ప్రస్తుతం గీతాకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *