యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కొద్ది నెలల క్రితం భార్య సమంతతో విడిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2017లో గోవా వేదికగా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందారు. కానీ ఏం లాభం. పెళ్లై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట విడాకులు వైపు మొగ్గు చూపి అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు.

అభిమానులైతే వీరి విడాకుల‌పై ఎంతగానో ఆందోళన చెందారు. కొందరు సమంతను టార్గెట్ చేస్తూ ఆమెపై దారుణ‌మైన విమర్శలు గుప్పించారు. ఏదేమైనప్ప‌టికీ ప్రస్తుతం అటు చైతు, ఇటు స‌మంత‌.. ఇద్ద‌రూ కెరీర్ లో ఉన్నతంగా రాణించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నరు. ఇకపోతే నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ గతంలో జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వీరిద్దరూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇవి పుకార్లే అంటూ శోభిత ఓ ఇంట‌ర్వ్యూలో తేల్చేసింది. అసలు నాగచైతన్య, తనకు మధ్య అంత క్లోజ్ పరిచయం కూడా లేదని, ఒకటి రెండు సార్లు హాయ్‌, బై చెప్పుకున్నామని తెలిపింది. ఇక నాగ‌ చైతన్య ఈ ప్ర‌చారంపై నోరు విప్ప‌క‌పోయినా.. ఎవరు ఊహించని విధంగా సమంత ఇలాంటి రూమ‌ర్లు ఆపాలంటూ ట్వీట్ చేసింది.

దాంతో నెట్టింట జరుగుతున్న ప్రచారంకు చెక్‌ పడింది. కానీ ఇప్పుడు మళ్లీ శోభిత‌తో చైతు డేటింగ్ చేస్తున్నాడ‌న్న వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు చూస్తే ఈ వార్తలు నిజమే అనిపించక మానదు. నాగచైతన్య శోభిత కలిసి పక్క పక్కనే నిల్చొని దిగిన ఫోటో రెండుగా కట్ చేసి కొంద‌రు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట‌ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీంతో శోభిత‌తో చైతు డేటింగ్ లో ఉన్నాడు అన‌డానికి ఈ ఫోటోలే ప్రూఫ్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/OptimistSiD/status/1595641230935068673?s=20&t=BkQ1e7e8iJV5p97MO4dXnw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *