టాలీవుడ్ లో దిగ్గజ నటుడు కమలహాసన్ గురించి.. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు తాజాగా కమలహాసన్ ఆస్పత్రిలో చేరారు అన్న వార్త ఆయన అభిమానులను చాలా కలవరపెడుతోంది. నిన్నటి రోజున కమలహాసన్ హైదరాబాద్ కి వచ్చి తన ప్రియమైన గురువు కళాతపస్వి విశ్వనాథుని కలిసి ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ తర్వాత నిన్నటి రాత్రి ఆయన చెన్నైకి చేరుకున్నారు . అంతలోనే కమలహాసన్ ఆస్పత్రిలో చేరారు అన్న వార్తతో అభిమానులలో ఒక్కసారిగా భయాందోళన మొదలయింది.

అయితే కేవలం కమలహాసన్ జ్వరం కారణంగా అస్వస్థతగా ఉండడంతో హాస్పిటల్లో చేరినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కమల్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ SRMC లో చేరినట్లుగా సమాచారం. అయితే రెగ్యులర్గా కమలహాసన్ హెల్త్ చెకప్ లో భాగంగానే ఆయన ఆసుపత్రిలో చేరినట్లు కోలీవుడ్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక జ్వరానికి చికిత్స చేసిన వైద్యులు రెండు రోజులపాటు కమలహాసన్ ను విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆ జ్వరం తగ్గిన వెంటనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Kamal Haasan Gets Nostalgic After Meeting Filmmaker K Viswanath, Shares Picఇక ఇటీవలే కమలహాసన్ విక్రమ్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఎన్నో సంవత్సరాలనుంచి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ అభిమానులకు ఈ చిత్రం మంచి స్టఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక కమలహాసన్ తమిళ్లో బిగ్ బాస్ సీజన్ 6 తో పాటు, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ -2 సినిమాలో నటిస్తూ ఉన్నారు. అందుకు సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతూ వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తుంది.

అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టడంతో ఈ సినిమా పూర్తి అయిన వెంటనే డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో KH -234 అనే సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరొక డైరెక్టర్ పిఏ రంజితతో ఒక సినిమా తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు కమల హాసన్ ఆరోగ్యం కుదురుగా ఉందనడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *