సోషల్ మీడియా పుణ్యమా అని వెండితెర బ్యూటీలకు ఏమాత్రం తీసిపోకుండా బుల్లితెర బ్యూటీ లైన జబర్దస్త్ ముద్దుగుమ్మలు కూడా తమ అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. గతంలో ఫోటోషూట్ అంటే కేవలం స్టార్ హీరోయిన్స్ మాత్రమే చేసేవారు. కానీ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా హాట్ ఫోటో షూట్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఈ లిస్టులో మొదటి స్థానంలో ఉంది జబర్దస్త్ కంటెస్టెంట్ వర్ష. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కంటెస్టెంట్ గా జబర్దస్త్ లోకి అడుగు పెట్టి ఇమ్మానుయేల్ తో లవ్ ట్రాక్ చేస్తూ చాలా ఫేమస్ అయిపోయింది.Jabardasth Varsha - Jabardasth Varsha - @varshajabardasth

నిజానికి వీరు ప్రేమించుకుంటున్నారా అనే డౌట్ వచ్చేంతగా రొమాన్స్ పండించారు .. నిజంగా వీరు ప్రేమించుకుంటున్నారో లేదో తెలియదు కానీ.. బుల్లితెరపై మాత్రం భార్యాభర్తల కంటే ఎక్కువగానే జీవించేస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక స్కిట్ లో ఇమ్మానుయేల్ ఏకంగా వర్ష మెడలో మూడు ముళ్ళు వేశాడు. దీంతో ఈ జంట పై సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో కామెంట్లు చేశారు. మరి కొంతమంది స్కిట్ ల కోసం పవిత్ర బంధమైన పెళ్లిని నవ్వులు పాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

మొత్తానికి అయితే మల్లెమాల ఛానల్ టి ఆర్ పి రేటింగ్ కోసం ఈ విధంగా చేపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇలా చేయడానికి వర్ష ఎక్కువ పారితోషకం తీసుకుంటోందని సమాచారం. వర్ష మొదట్లో వచ్చినప్పుడు ఆమె పారితోషకం చాలా తక్కువ.. ఎప్పుడైతే ఇమ్మాన్యుయెల్ తో కలసి స్కిట్స్ చేయడం మొదలుపెట్టిందో.. అప్పటినుంచి ఆమె పారితోషకం కూడా పెరిగిపోయింది . సాధారణంగా ఒక్కో స్కిట్ చేస్తే ఆమెకు ఒక ఎపిసోడ్ కి రూ. 20వేల వరకు పారితోషకం ఉండేది.

కానీ ఇమ్మానుయేల్ తో క్లోజ్ గా ఉంటూ లవ్ ట్రాక్ చేసే స్కిట్లకైతే ఒక్కో ఎపిసోడ్ కి దాదాపు రూ.40 వేల వరకు తీసుకుంటుందని సమాచారం. అయితే ఎవరేమనుకుంటే నాకేమన్నట్లుగా ఇమ్మన్యూయేల్ తో కలిసి జంటగా చేస్తూ డబ్బులు మాత్రం వెనకేసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న జబర్దస్త్ కంటెస్టెంట్లతో పోల్చితే వర్షకి ఎక్కువగా పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *